పాక్ ప్రధానికి దెబ్బ మీద దెబ్బ  

by vinod kumar |
పాక్ ప్రధానికి దెబ్బ మీద దెబ్బ  
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్… ఇప్పుడు అదే వ్యవహారంపై చిక్కుల్లో పడుతోంది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేసే అంతర్జాతీయ సంస్థ ఎఫ్‌ఏటీఎఫ్ ఆంక్షలను తప్పించుకునేందుకు అండర్‌వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీమ్ తమ దగ్గరే ఉన్నాడని పాక్ ఒప్పుకోవాల్సి వచ్చింది.

ఇక సిరియాలో కూడా పాక్ ఉగ్రవాదులు కల్పించుకుంటున్నారన్న ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం విచారణ చేపట్టింది. దీంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా ప్రభుత్వ సహాయంతో సిరియాలోని కుర్దుల సేన ఐసిస్ ఉగ్రవాదులతో పోరాడుతోంది.

తాజాగా 29 మంది పాకిస్థానీలను బందీలుగా తీసుకున్న కుర్దుల సేన… వీరందరూ ఐసిస్ ఉగ్ర సంస్థ తరఫున తమతో పోరాడుతున్నారని ఆరోపించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అమెరికా ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో ఏం బట్టబయలవుతాయో… ఎలా బయటపడాలో… ట్రంప్ సార్ కి ఏం చెప్పాలో తెలీక పాకిస్తాన్ ఇమ్రాన్ సేన సతమవుతున్నారట.

Advertisement

Next Story

Most Viewed