- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉల్లాసవంతమైన ఆత్మహత్యకు.. సూసైడ్ క్యాప్సూల్..
దిశ, ఫీచర్స్: టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రతి పనిలో యంత్రాల వాడకం మొదలైంది. ఈ క్రమంలోనే మనిషికి అత్యంత శారీరక శ్రమతో కూడిన పనుల నుంచి విముక్తి కలిగింది. కానీ నొప్పి తెలియకుండా చనిపోయే సాంకేతికైతే రాలేదు. ప్రపంచ దేశాలు ఆత్మహత్యను నేరం గా పరిగణించడం వల్ల ఈ దిశగా అడుగులు పడలేదేమో. అయితే కొన్ని దేశాలు మాత్రం చావుతో పోరాడుతున్న వారికి.. డాక్టర్ సూచించిన ఏవైనా మందులు లేదా ఎవరైనా వ్యక్తి సాయంతో (అసిస్టెడ్ సూసైడ్) చనిపోయేందుకు అనుమతించగా స్విట్జర్లాండ్ కూడా అందులో ఒకటి. ఇప్పుడు అలాంటి వ్యక్తుల కోసం రూపొందించిన ‘3D ప్రింటెడ్ క్యాప్సూల్’కు స్విట్జర్లాండ్‌లో అన్ని రకాల లీగల్ పర్మిషన్స్ లభించగా.. 2022 నుంచి ఉపయోగించే అవకాశం ఉంది.
30-సెకన్ల ప్రక్రియ- సార్కో!
‘సార్కో’ అనే పేరుతో పిలువబడే ఈ యంత్రాన్ని ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ డిజైన్ చేసింది. ఇందులో కూర్చున్న వ్యక్తికి కార్బన్ డై యాక్సైడ్, ఆక్సిజన్ నిరోధించడం ద్వారా మరణించడంలో ఈ పరికరం సాయపడుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో వ్యక్తి ఎటువంటి భయాందోళన లేదా నొప్పిని అనుభవించడు. స్విట్జర్లాండ్‌లో అసిస్టెడ్ సూసైడ్‌కు చట్టపర అనుమతి ఉన్నందునా.. ఈ పరికరాన్ని ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఆ దేశంలో ప్రవేశపెట్టేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కాగా ఈ కంపెనీ వ్యవస్థాపకుడైన ‘డాక్టర్ ఫిలిప్ నిట్‌ష్కే’ స్విస్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.
‘ఈ ప్రక్రియ మొత్తం 30 సెకన్లలో పూర్తవుతుంది. వ్యక్తి స్పృహ కోల్పోకముందే కొద్దిగా దిక్కుతోచని అనుభూతి చెందుతారు, కొంచెం ఉల్లాసంగా అనిపించవచ్చు. క్యాప్సూల్ పరికరం లోపలి భాగం మొత్తం నైట్రోజన్‌తో నింపబడి ఉంటుంది. అందులో కూర్చున్న తర్వాత ఆక్సిజన్ స్థాయి 21 నుంచి వేగంగా 1 శాతానికి తగ్గిస్తుంది’ అని తెలిపారు. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు సార్కో డివైజ్‌లు మాత్రమే ఫంక్షనింగ్‌లో ఉండగా.. మూడోది నెదర్లాండ్స్‌లో తయారవుతోంది. శవపేటికలా కనిపించే ఈ సార్కో పరికరాన్ని మొదటిసారి 2018లో ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఫ్యూనరల్ ఫెయిర్‌లో ఆవిష్కరించారు.