ప్రజలు బయటకు రాకుండా … ‘కోడి పెంట’ పరిష్కారం

by vinod kumar |
ప్రజలు బయటకు రాకుండా … ‘కోడి పెంట’ పరిష్కారం
X

దిశ, వెబ్ డెస్క్ : లాక్‌డౌన్‌లో బయటకు వెళ్లొద్దని పోలీసులు, ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా.. జనాలు రోడ్లమీద తిరుగుతూనే ఉన్నారు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లినా సరే.. గుంపులు గుంపులుగా జమవుతూ .. సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. లాక్డౌన్ ఎంత కఠినంగా అమలు చేసినా.. ఒక్కరి నిర్లక్ష్యంతో కథంతా మళ్లీ మొదటికి వస్తుంది. ఎంతో మంది సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. స్వీడన్ ప్రజలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అక్కడ లాక్డౌన్ అమల్లో లేకున్నా.. సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలనే నిబంధన అమల్లో ఉంది. ఒక ఫెస్టివల్ కోసం గుంపులుగా జనాలు చేరారు. దీంతో స్వీడన్ ప్రజలు ఓ సరికొత్త పరిష్కారంతో బయట తిరిగే జనాలకు చెక్ చెప్పారు.

స్వీడన్ లోని లూండ్ సిటీలోని సెంట్రల్ పార్క్ మొత్తం కూడా … కోడి పెంటతో నిండిపోయింది. ఎందుకలా అనుకుంటున్నారా? లూండాతో పాటు, స్కాండినివియాల్లో ప్రతి సంవత్సరం ‘వాల్పురిగీస్ నైట్’అనే ఓ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కోసం భారీగా జనాలు రోడ్ల మీదకు వస్తారు. ఎంత బుద్ధిగా చెప్పినా, హెచ్చరించినా.. ప్రజలు వినకపోవడంతో… అక్కడి అధికారులు.. కోడి పెంటతో పరిష్కారం వెతికారు. ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా కుర్చుంటారో ఆ ప్రాంతాల్లో కోడి పెంటను వేస్తున్నారు. స్వీడన్‌లోని లూండ్ సిటీలో జనాలంతా పార్కుల్లో కుర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. దీంతో అధికారులు కోడి పెంటను తీసుకెళ్లి.. పార్కుల్లో డంప్ చేస్తున్నారు. ఆ కంపును భరించలేక ప్రజలకు బయటకు వెళ్లడం లేదు. ‘వాల్పురిగీస్ నైట్’ ఫెస్టివల్ కోసం సెంట్రల్ పార్క్‌ దగ్గర ప్రజలంతా ఒక్కచోటే చేరారు. దీంతో షాకైన అధికారులు.. మళ్లీ అలాంటి సమావేశాలు జరగకుండా అన్ని పార్కుల్లో కోడి రెట్టలతో తయారు చేసిన పెంటను డంప్ చేశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఇలా కోడి పెంట వేయడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని, ఒకవైపు పచ్చిక బయళ్లకు మంచి ఎరువు వేసినట్లు ఉండటమే కాకుండా, ప్రజలు పార్కుల్లోకి రాకుండా ఉపయోగపడుతుందని తెలిపారు.

Tags : sweedan, lund, chicken shit, central park

Advertisement

Next Story