లాక్‌డౌన్ ఎత్తేసేంతవరకు స్వామివారి దర్శనాలు లేవు: టీటీడీ ఛైర్మన్

by srinivas |   ( Updated:2020-05-02 06:03:12.0  )
లాక్‌డౌన్ ఎత్తేసేంతవరకు స్వామివారి దర్శనాలు లేవు: టీటీడీ ఛైర్మన్
X

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ ఎత్తేసేంతవరకు స్వామి వారి దర్శనాలు ఉండవని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సుమారు 40 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. తిరిగి దర్శనాలు ఎప్పటి నుంచి కల్పిస్తారన్న విషయంపై ఆయన స్పందిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఆయా ప్రభుత్వాల సూచన మేరకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని అన్నారు.

అయితే ఈ సారి గతంలోలా వేలు, లక్షలాది మందికి దర్శనాలు కల్పించే అవకావం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి పూర్తిగా నిర్మూలించబడేంతవరకు భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ క్యూలైన్లతో పాటు వివిధ సందర్భాల్లో సాగించే కైంకర్యాల్లో భక్తుల దర్శనాలలో మార్పులు చోటేచేసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

భారీ సంఖ్యలో తిరుమలను భక్తులు సందర్శించే అవకాశం ఉండడంతో ఒక్కో భక్తుడు కనీసం ఒక మీటర్ భౌతి దూరాన్ని పాటించేలా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. ప్రభుత్వాల సూచన మేరకు, భక్తుల మనోభావాలకనుగుణంగా వీలైనంత త్వరగా స్వామి వారి దర్శనాలు కలిగే సౌకర్యం కల్పిస్తామని అన్నారు. అలాగే మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు భక్తుల సంఖ్య ఆధారంగా తిరుమలలో కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

Tags: ttd, tirumala, ttd chirman, yv subbareddy, tirupati

Advertisement

Next Story

Most Viewed