ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్న సుజుకి మోటార్

by Harish |   ( Updated:2021-07-19 07:14:47.0  )
ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్న సుజుకి మోటార్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ కంపెనీ 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు సోమవారం వెల్లడించింది. ప్రభుత్వ సబ్సిడీలను పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కాంపాక్ట్ మోడల్ కారును 13,626 డాలర్ల(రూ. కు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘సుజుకి మోటార్ కంపెనీ 2025 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాం, బలమైన హైబ్రిడ్ కార్ల విభాగంలోకి ప్రవేశిస్తామని, దీనివల్ల భారతీయ వినియోగదారులకు మరింత చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తామని’ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, కంపెనీ తీసుకురాబోయే ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి ధరకు సంబంధిచిన వివరాలపై స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా భారత్‌లోనే మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభిస్తుందా అనేదానిపై వివరణ ఇవ్వలేదు.

Advertisement

Next Story

Most Viewed