- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానంతో ఆత్మహత్యా యత్నం, ఆపై కరోనా..
దిశ, నర్సంపేట : కొద్ది రోజులుగా జ్వరం వస్తుండటంతో కరోనా కావొచ్చన్న అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన నెక్కొండ మండలంలోని దీక్షకుంట్లలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… దీక్షకుంట్ల గ్రామానికి చెందిన బండారు కుమారస్వామి (45) గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. దానికి తోడు సరిగా తినకపోవడంతో నీరసించిపోయాడు. కరోనా సోకిందేమో అని అతని కుటుంబ సభ్యుల్లో మొదలైన అనుమానం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని నెక్కొండలోని ఆస్పత్రికి తరలించారు.
రెండ్రోజుల చికిత్స అనంతరం అక్కడ నుండి వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి శనివారం తరలించారు. శనివారం సాయంత్రం టెస్ట్ చేయగా మొదట నెగటివ్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం పొద్దున మరోసారి చేయగా పాజిటివ్ గా వచ్చినట్లు సమాచారం. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడం తో ఆస్పత్రిలో మృతి చెందాడు. అతని మృతదేహన్ని స్వగ్రామమైన దీక్షకుంట్లకి సోమవారం ఉదయం తరలించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకొని దహనసంస్కారాలు పూర్తి చేశారు.