- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీ తల్లి ఎవరు? నెటిజన్ ప్రశ్నకు స్టార్ కూతురి ఆన్సర్!
దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ కూతురు రెనీ సేన్.. తన తల్లిలాగే మంచి నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రిపేర్ అవుతోంది. కాగా 24 ఏళ్ల వయసులో రెనీని దత్తత తీసుకున్న సుస్మిత.. ఇదేక్రమంలో మరో కూతురు ఆయేషాను కూడా అడాప్ట్ చేసుకుంది. అయితే రీసెంట్గా రెనీని తన ‘రియల్ మదర్’ ఎవరని నెటిజన్లు ప్రశ్నించగా.. ఈ క్వశ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలాసార్లు ఎదుర్కొన్నానని, అసలు ‘రియల్ మదర్’కు అర్థమేంటో చెప్పాలని వారినే అడిగినట్లు చెప్పింది. ‘సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ జనాలకు ఉండటంలో తప్పు లేదు. కానీ ఒకరికొకరు హుందాగా ప్రవర్తించాలని నేను కోరుకుంటా. ఎందుకంటే నా గురించిన నిజాలన్నీ అందరికీ తెలుసుకాబట్టి నాపై ఇలాంటివి పెద్దగా ప్రభావం చూపవు. కానీ ప్రైవేట్ లైఫ్‌ను ఇష్టపడే వారిపై మీ ప్రశ్న ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనకు తెలియదు. అందుకే సదరు వ్యక్తులు చెప్పేంతవరకు వారి పర్సనల్ లైఫ్ గురించి అడగకపోవడమే మంచిది’ అని వెల్లడించింది.
గతంలోనూ ఇన్‌స్టా ఇంటరాక్టివ్ సెషన్లో ఇదే ప్రశ్న ఎదురవగా.. ‘నేను నా తల్లి హృదయానికి పుట్టాను, ఇదే నిజం’ అని సమాధానమిచ్చింది. ఇక కబీర్ ఖురానా డైరెక్షన్లో తెరకెక్కిన ‘సుత్తబాజీ’ షార్ట్ ఫిల్మ్ ద్వారా రెనీ యాక్ట్రెస్‌గా ఎంట్రీ ఇస్తుండగా.. సుస్మితా సేన్ పుట్టినరోజున ట్రైలర్ రిలీజ్ కాగా, డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.