- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోకల్ టైలర్ గౌన్.. మిస్ ఇండియా క్రౌన్
సుస్మితా సేన్ మాజీ విశ్వసుందరి. 1994లో మిస్ ఇండియా టైటిల్ అందుకున్న సుస్మిత.. అదే ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని చేజిక్కించుకుని, భారత్ తరఫున ఆ టైటిల్ గెలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఈ ప్రయాణానికి 26 ఏళ్లు పూర్తి కాగా.. విశ్వ సుందరి కిరీటంలో మెరిసిపోతున్న సుస్మితా సేన్ ఫోటోను షేర్ చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తన బాయ్ ఫ్రెండ్ రోహ్మన్ షాల్. ‘నువ్వు మమ్మల్ని గర్వించేలా చేసిన రోజుకు 26 ఏళ్లు మేరీ జాన్.. నీ పనులతో మేం ఎప్పటికీ గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.
ఈ మధ్య మిస్ ఇండియా జర్నీ గురించి మాట్లాడిన ఈ మాజీ విశ్వసుందరి.. తను మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయినని తెలిపింది. షో కోసం కాస్ట్‌లీ గౌన్ కొనే స్థోమత లేక బాధపడుతుంటే.. ‘ఎందుకు బాధ.. వాళ్లు నిన్ను చూస్తారు.. నీ టాలెంట్ చూస్తారు.. అంతేకాని నీ బట్టలను కాదని’ వాళ్లమ్మ చెప్పిందట. దీంతో ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్‌లో క్లాత్ తీసుకుని, లోకల్ టైలర్ దగ్గర గౌన్ కుట్టించినట్టు తెలిపింది. ఇది టీవీలో వస్తుందని చెప్తే.. టైలర్ విన్నింగ్ గౌన్ రెడీ చేశాడని, అమ్మ అందుకు తగిన రోజ్ తయారుచేసి గౌన్‌కు స్పెషల్ అట్రాక్షన్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది’ అని గుర్తు చేసుకుంది సుస్మితా సేన్.
తన విజయవంతమైన ప్రయాణంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ సుస్మిత ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో స్పెషల్ వీడియో కూడా పోస్ట్ చేసింది.