సౌండ్స్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్న ఎమోజీలు!

by Shyam |
Surprising emoji
X

దిశ, ఫీచర్స్: మనసులోని భావాలను మాటల్లోనే కాదు సింబల్స్‌లోనూ వ్యక్తపరచవచ్చు. అలాంటి సింబల్స్‌‌ ఇప్పుడు ‘ఎమోజీ’ల రూపంలో దర్శనమిస్తున్నాయి. స్మార్ట్ యుగంలో మాట్లాడే అవసరం లేకుండా ఎమోషన్స్, ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడంలో ‘ఎమోజీ’లను మించిన టెక్ట్స్ లేదు. వరల్డ్ వైడ్‌గా ఎంతో పాపులారిటీ సాధించిన వీటికి కూడా ఓ స్పెషల్ డే కేటాయించారు. ప్రతీ ఏడాది జులై 17న వరల్డ్‌ ‘ఎమోజీ డే’ను జరుపుకుంటుండగా.. ఈ సందర్భంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ‘సౌండ్ ఎమోజీ’లను లాంచ్ చేసింది.

ప్రస్తుతం ఎమోజీల వాడకం విపరీతంగా పెరిగిపోగా, యూజర్లకు మరింత వినోదం అందించేందుకు ఫేస్ బుక్ తన మెసెంజర్‌లో సౌండ్‌ ఎమోజీలను చేర్చనుంది. అసలు ఏంటి ఈ సౌండ్ ఫీచర్ అని అనుకుంటున్నారా? ఉదాహరణకు స్నేహితుడికి నవ్వుతున్న ఎమోజీ సెండ్ చేశారనుకోండి. ఆ ఎమోజీకి నవ్వుతున్న సౌండ్ వినిపిస్తుంది. సాధారణ ఎమోజీలానే వీటిని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం సౌండ్‌ ఎమోజీ ఆడియో క్లిప్పుల్లో చప్పట్లు, బర్త్ డే పార్టీ డ్రమ్ రోల్, వాయిద్యాలు, కార్ సౌండ్, ఈవిల్ లాఫర్ వంటివి ఉన్నాయి. రెబెక్కా బ్లాక్ తదితర నటుల ఆడియో క్లిప్పులతో పాటు యూనివర్సల్ పిక్చర్స్, ఎఫ్9, ఎన్బీసీ, యూనివర్సల్ టెలివిజన్ బ్రూక్లిన్ నైన్-నైన్, నెట్ ఫ్లిక్స్, బ్రిడ్జర్టన్ లాంటి టీవీ షోలు, సినిమాల ఆడియో క్లిప్పులు కూడా ఇందులో ఉన్నాయి.

మెసెంజర్‌లో ఎమోజీ లైబ్రరీ నుంచి కావాల్సిన ఎమోజీని పంపుకోవచ్చు. అయితే ఆ పక్కనే ఉన్న సౌండ్‌ బటన్‌ను క్లిక్‌ చేస్తే సౌండ్ ఎమోజీల లిస్ట్ కనిపిస్తుంది. ఒకవేళ బటన్‌ కనిపించకుంటే.. యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed