- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే నేనూ అదే రోజు రాజీనామా చేశా
దిశ, స్పోర్ట్స్: మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాలు ఒకే రోజు తమ రిటైర్మెంట్‌లను ప్రకటించి క్రీడాభిమానులకు డబుల్ షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజు(ఆగస్టు 15)న ఇద్దరూ తమ రిటైర్మెంట్లను (Retirement) ప్రకటించారు. అయితే, ధోని తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ (International cricket)కు గుడ్ బై చెప్పాడు.
అయితే, ధోని రిటైర్‌మెంట్ (Dhoni Retirement) విషయం అందరూ ఊహించిందే కానీ, ఎప్పుడు చేస్తాడో అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. కానీ, రైనా మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ధోని ప్రకటించిన వెంటనే తానూ రిటైర్ అవుతున్నట్టు వెల్లడించాడు. దీనికి గల కారణాలను పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్న సమయంలో రైనా స్పందించాడు.
‘ధోనీ జెర్సీ నంబర్ 7, నా జెర్సీ నంబర్ 3. ఈ రెండూ కలిపితే 73 వస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో 73 ఏళ్లు పూర్తయ్యాయి. అందుకే నేనూ అదే రోజున రిటైర్మెంట్ ప్రకటించాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ధోనీ, రైనాలు దాదాపు ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్లో (international cricket)కి అడుగుపెట్టారు. అప్పట్నుంచీ ఇద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.