అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా వీడ్కోలు

by Anukaran |   ( Updated:2020-08-15 09:59:39.0  )
అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా వీడ్కోలు
X

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ (International cricket) నుంచి రిటైర్ (Retired) అవుతున్నట్లు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (Former captain MS Dhoni) ప్రకటించిన నిమిషాల వ్యవధిలో అతడి స్నేహితుడు సురేష్ రైనా (Suresh Raina) కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌ (International cricket)కు తాను రిటైర్ (Retired) అవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో వెల్లడించాడు.

‘నీతో కలసి ఆడటం నిజంగా సంతోషం మహీ.. నేను మనస్పూర్తిగా చెబుతున్నాను.. నీ ప్రయాణంలో నేనూ కలవాలనుకుంటున్నాను. థాంక్యూ ఇండియా’ అని అతడు ఇన్‌స్టాలో పోస్టు (Posted in Insta) పెట్టాడు. దాంటో పాటు సీఎస్కే (CSK) జట్టు సభ్యులతో ఉన్న ఫొటోను కూడా జత చేశాడు.

టీం ఇండియాలో ధోనీకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే అందరూ రైనా అనే చెబుతారు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నంత కాలం రైనా చోటుకు ఢోకా లేకుండా పోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైనా 2005లో భారత జట్టు (Indian team) లో స్థానం సంపాదించాడు. 30 జులై 2005లో తొలి వన్డే (First ODI)శ్రీలంక (Sri Lanka)పై ఆడాడు. చివరి సారిగా 17 జులై 2018న ఇంగ్లాండ్ జట్టు (England team)తో జరిగిన వన్డేలో ఆడాడు. ఆ తర్వాత అతడికి అంతర్జాతీయ క్రికెట్ (International cricket) ఆడే అవకాశం రాలేదు. ఇక 2010 జులై 26న శ్రీలంకపై తొలి టెస్టు ఆడిన రైనా, 2015 జనవరి 10న ఆస్ట్రేలియాపై చివరి టెస్టు ఆడాడు.

రైనా తన కెరీర్‌లో 19 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 7 సెంచరీలు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed