రఘురామకృష్ణం రాజు ఇష్యూ… 'సుప్రీం' కీలక ఆదేశాలు

by Anukaran |
రఘురామకృష్ణం రాజు ఇష్యూ… సుప్రీం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. విచారణ పేరుతో పోలీసులు తనపై దాడి చేశారని రఘురామకృష్ణం రాజు లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

కాగా ఆయనపై సీఐడీ కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పై స్టే విధించాలని ఆయన పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది. కాగా ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామకృష్ణం రాజుకు హైదరాబాద్ లోని ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్టు సమాచారం. పిటిషన్ పై అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది ఆదేశాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed