- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Patitala Sunitha: ఇక్కడ భయపడే వారెవరు లేరు.. ఎమ్మెల్యే పరిటాల సునీత

* జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడు..
* తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు..
* లింగమయ్యకు న్యాయం చేస్తాడా
* పరామర్శకు వచ్చి ఆ జేజేలు ఏంటి?
* రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధ్వజం
దిశ డైనమిక్ బ్యూరో : ' ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు.. చెల్లికి న్యాయం చేయలేదు వ్యక్తి.. ఈరోజు నా మండలానికి వచ్చి మాట్లాడతాడా.. అంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) ధ్వజమెత్తారు. విలేకరులతో మాట్లాడుతూ జగన్ (YS Jagan)వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. నీకు నవ్వుకు ఏడుపుకు తెలియదు అన్నారు. జగన్ శవరాజకీయాలు చేస్తున్నాడని ఆలోచించారు. లింగమయ్య(Lingamayya) కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడా లేక ప్రచారానికి వచ్చాడా అని ప్రశ్నించారు. అభిమానుల చేత జేజేలు పలికించుకుంటూ.. జగన్ సీఎం అని అనిపించుకోవడానికి వచ్చాడా అని అడిగారు. జేజేలు పలుకుతూ సెల్ఫీలు తీసుకుంటూ పరామర్శకు వస్తారా అని ప్రశ్నించారు. గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా జగన్ మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే నోటి నుంచి ఒక్క నిజమైన వచ్చిందా అని అడిగారు. ఇక్కడి మాజీ ఎమ్మెల్యేలు చెప్పిన అబద్ధపు మాటలు విని విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి పల్లెల్లో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పులివెందులలో బాత్రూంలో చంపుతారు ఏమో గాని.. అనంతపురంలో అటువంటి హత్యలు జరగవన్నారు. అబద్ధాలు పేపర్ పై రాసుకొచ్చి జగన్ మాట్లాడి వెళ్లారని అన్నారు. లింగమయ్య మరణాన్ని ఫ్యాక్షన్ మర్డర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడటం ఏంటి అని ప్రశ్నించారు. పోలీసులపై (AP Police) దుర్మార్గంగా మాట్లాడటం సరికాదు అని హితవు పలికారు. నన్ను, నా కుమారుడిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు.. అంటూ మండిపడ్డారు. మేము కావాలంటే ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునే వారమని తెలిపారు. జగన్ నాయన వచ్చినా నన్ను ఆపలేరు అన్నారు. కానీ అంత నీతిమాలిన రాజకీయాలు చేతలచుకోలేదని ఆమె తెలిపారు. నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేస్తావా నేను భగవద్గీత మీద ప్రమాణం చేస్తానని జగన్కు సవాలు విసిరారు. ఎమ్మెల్యే తోపును ఉద్దేశించి చేతకాని దద్దమ్మ అని వ్యాఖ్యానించారు. జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు జిల్లా ఎస్పీ స్పందించాలన్నారు. మా నాయకులు, మా కార్యకర్తలు, మేము అనుకుని ఉంటే మీరు ఈ గడ్డ మీద అడుగు పెట్టేవారు కాదన్నారు. పదేపదే లేనివి ఉన్నట్టు సృష్టించి మాట్లాడటం సరికాదన్నారు. ఈరోజు జగన్ మాట్లాడిన దానిలో పచ్చి అబద్దాలు ఉన్నాయన్నారు. జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారని అన్నారు.