హజ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు నల్లగొండలో యాక్సిడెంట్.. మొత్తం 10 మంది..

by Aamani |   ( Updated:2025-04-08 09:20:08.0  )
హజ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు నల్లగొండలో యాక్సిడెంట్.. మొత్తం 10 మంది..
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి నార్కెట్ పల్లి హైవే లెప్రసీ కాలనీ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హజ్ యాత్ర కోసం వెళ్తున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను దాదాపు మూడు అంబులెన్స్ లలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed