- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న టాలీవుడ్ హీరోయిన్.. అంతా దానికోసమే అంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా(Tamannah) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల-2’(Odela-2). అశోక్ తేజ(Ashok Teja) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. సంపత్ నంది(Sampath Nandi) కథ అందించడంతో పాటు రచయితగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇందులో హెబ్బా పటేల్(Hebah Patel), వశిష్ట ఎన్ సింహ(Vasishta N Simha) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ‘ఓదెల రైల్వేై స్టేషన్’(Odela Railway Station)కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ మూవీలో తమన్నా నాగసాధువుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 17న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఓదెల-2 ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో తాజాగా తమన్నా, సంపత్ నంది, ఆదిత్య భాటియా, ప్రొడ్యూసర్ మధులు ముంబైలోని బాబుల్‌నాథ్ టెంపుల్‌ను విజిట్ చేశారు. అక్కడ కొబ్బరికాయ, పూలు సమర్పించి పూజారి నుంచి బ్రెల్లింగ్స్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మూవీ హిట్ కావాలనే కదా ఈ పూజలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.