' రైతుల భూ సమస్యలకు భూ భారతిలోనే పరిష్కారం '

by Sumithra |
 రైతుల భూ సమస్యలకు భూ భారతిలోనే పరిష్కారం
X

దిశ, మానోపాడు : రైతుల భూ సమస్యలు ఎలాంటివి అయినా పరిష్కరించుకొనుటకే కాంగ్రెస్ సర్కార్ భూ భారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, ఇక రైతుల కష్టాలు తీరినట్టేనని అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కుమార్ అన్నారు. చట్టంలో మార్పులు తీసుకొచ్చి రైతుల కష్టాలను చట్టం ద్వారానే నెరవేర్చాలని ఉద్దేశంతో భూ భారతి కొత్త చట్టం అమలు అయిందని జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. మానోపాడు మండల కేంద్రంలో భూ భారతి చట్టం రైతుల చుట్టం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కుమార్ హాజరయ్యారు. ముందుగా వీరిని స్థానిక తహశీల్దార్ జోషి శ్రీనివాస్ రావు వారిని ఘనంగా సన్మానించుకున్నారు.

అనంతరం కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణిలో మార్పులు చేర్పులు చేయనీయకుండా చట్టం తీసుకొచ్చి కాస్త రైతులకు ఇబ్బంది పెట్టిందని, ఎలాంటి సమస్య లేకుండా రైతులకు భూ పరిష్కారం చూయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భూభారతి చట్టం రైతుల చుట్టం అనే కొత్త చట్టాన్ని తెచ్చింది అన్నారు. ఈ కొత్త చట్టంలో రైతులకు ఎలాంటి సమస్య ఉండదని, ఏదైనా సమస్య ఉంటే మార్పులు కూడా చూసుకోవడానికి సులువైన మార్గం తీసుకు వచ్చిందన్నారు. ప్రతి రైతు ఈ భూ భారత్ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జోషి శ్రీనివాస్ రావు, ఎంపీడీవో భాస్కర్, డిప్యూటీ తహశీల్దార్ ధరణి షా, వ్యవసాయ అధికారులు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు, రేషన్ డీలర్లు, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed