- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TTD:శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. టికెట్ల బుకింగ్‌కు డైరెక్ట్ లింక్ ఇదే!

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటైన తిరుమల(Tirumala)కు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు వెళుతుంటారు. కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు(Devotees) కంపార్ట్‌మెంట్లలో బారులు తీరుతుంటారు. ఈ తరుణంలో శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తులు వేచి చూస్తారు. అయితే.. జూలై నెల కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ(TTD) ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను ఇవాళ(మంగళవారం) ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. వర్చువల్ సేవలు, వాటి దర్శనం స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ తరుణంలో శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా..
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా..
జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా..
తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.