నీ అవ్వ తగ్గేదెలా... అల్లు అర్జున్ మరో సినిమాపై బిగ్ అప్డేట్ !

by Veldandi saikiran |
నీ అవ్వ తగ్గేదెలా... అల్లు అర్జున్ మరో సినిమాపై  బిగ్ అప్డేట్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun ) ఇటీవల పుష్ప 2 సినిమాతో ( Pushpa 2) బంపర్ హిట్ కొట్టి... మంచి ఊపులో ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత... అల్లు అర్జున్ చేయబోయే ప్రతి సినిమా పైన భారీ అంచనాలు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలోనే.. అల్లు అర్జున్ ( Allu Arjun ) చేయబోయే తర్వాతి సినిమాలపై ఇవాళ అప్డేట్స్ వచ్చాయి. అల్లు అర్జున్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో... ఇవాళ తమిళ దర్శకుడు అట్లీతో చేయబోయే సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది.

అంతేకాదు.. అల్లు అర్జున్ మరో సినిమా పైన కూడా.. కాసేపటి క్రితమే కీలక ప్రకటన వెలువడింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా ఎప్పటి నుంచో ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో.. మొన్నటి వరకు వార్తలు రాగా... ఇవాళ అధికారిక ప్రకటన వచ్చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ( Haarika and Hassine Creations) ఆధ్వర్యంలో వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ ( Trivikram) దర్శకత్వం వహిస్తున్నాడు.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అలా వైకుంఠపురం లో, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలాంటి సినిమాలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతోంది. అల్లు అర్జున్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో.. ఆయనకు విషెస్ చెబుతూ.. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ కు సంబంధించిన పోస్టర్ కూడా వదిలారు. ప్రొడక్షన్ 8 పేరుతో ఈ సినిమా వస్తోంది. తర్వాత టైటిల్ ప్రకటించే ఛాన్సులు ఉంటాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story