- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిఖీని ఢిల్లీకి తరలించండి.. యూపీకి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : కరోనా బారినపడి అనారోగ్యం పాలైన కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌ను యూపీ నుంచి ఢిల్లీకి తరలించాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధుర జైలులో ఉన్న సిద్దిఖీ.. ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుందని ఆరోపిస్తూ ఆయన భార్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. సిద్దిఖీని మధుర నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి ఆయన కోలుకున్న తర్వాత తిరిగి జైలుకు తీసుకెళ్లాలని ఆదేశించింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిని వ్యతిరేకించారు.
మధురలో గానీ, ఢిల్లీ ఆస్పత్రులలో బెడ్లు ఖాళీ లేవని, అయినా డయాబెటిస్ పేషెంట్ కోసం (సిద్దిఖీని ఉద్దేశిస్తూ..) ఒక బెడ్ ఎందుకు వృథా చేయడమని వ్యాఖ్యానించారు. దీనిపై కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అతడిని ఢిల్లీలోని ఏ ఆస్పత్రిలో చేర్పించాలో చెప్పాలని అడిగారు. కొద్దిరోజుల క్రితం యూపీలోని హత్రాస్ దళిత యువతి అత్యాచార ఘటనానంతరం అక్కడకు వెళ్లి కుల వైషమ్యాలు రెచ్చగొట్టారని ఆరోపిస్తూ యోగి సర్కారు సిద్దిఖీ మీద కేసు నమోదు చేసింది.