ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

by Anukaran |   ( Updated:2021-01-25 06:11:58.0  )
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం.. ఎన్నికలు వాయిదా కుదరదని, పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో ఏపీలో షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం కష్టమని, గోవా సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా పడ్డ విషయాన్ని గుర్తు చేశారు. కరోనా వ్యాక్సిన్ కోసమే ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేసిందని, హైకోర్టు సింగిల్ బెంచ్‌ సైతం ఈసీ నిర్ణయాన్ని సస్పెండ్ చేశారని గట్టిగా వాదనలు వినించారు.

దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా అన్న సుప్రీం ధర్మాసనం.. ఉద్యోగ సంఘాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారు, ఇప్పుడెందుకు వాయిదా కోరుతున్నారని ప్రశ్నించింది. ఎన్నికలు ప్రతిసారి వాయిదా పడుతున్నాయని, ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, అందులో భాగంగానే ఈసీ పనిచేస్తోందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed