- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘బాబ్రీ’ కేసులో ఎల్‌కే అడ్వాణీపై విచారణ ఆగస్టులోపు ముగించండి : సుప్రీం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించిన కేసులో బీజేపీ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలపై సీబీఐ కోర్టు విచారణకు తుది గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 31లోపు ఈ కేసులో తుది తీర్పు వెలువడాలని, ఈ గడువులోపు తప్పకుండా విచారణ ముగించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ వల్ల విచారణ జాప్యమైందని, కాబట్టి తుది తీర్పునకు గడువును పొడిగించాలని సీబీఐ జడ్జి రాసిన లేఖకు సమాధానంగా సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. అడ్వాణీ, జోషి, ఉమా భారతి సహా 2017లో ఈ కేసులోకి బీజేపీ చట్టసభ్యుడు వినయ్ కతియార్, సాధ్వి రితంబరాలు చేరారు. హై ప్రొఫైల్ నిందితులు గిరిరాజ్ కిశోర్, విశ్వ హింద్ పరిషద్ నేత అశోక్ సింఘాల్, హరి దాల్మియాలు ఈ విచారణ సాగుతుండగానే మరణించడం గమనార్హం. 2017లో ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు రెండేళ్ల గడువునిచ్చింది. అప్పటి నుంచి ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ ఏప్రిల్ చివరికల్లా ఈ కేసులో తుది తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ, తాజాగా గడువును పొడిగించాలని సీబీఐ జడ్జీ లేఖ రాయడంతో ఈ తేదీని ఆగస్టు 31కి సుప్రీంకోర్టు పెంచింది.
tags: babri masjid demolition, bjp leaders, cbi trial, deadline extended