- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీం పచ్చజెండా..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో బాణాసంచా కొనుగోలు, అమ్మకాలపై హైకోర్టు బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే వ్యాపారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.క్రాకర్స్‌పై నిషేధం విధించడం వలన తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని, అలాంటప్పుడు తయారీకి ఎందుకు అనుమతులు ఇచ్చారని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా, ఎన్జీటీ తీర్పునకు లోబడే హైకోర్టు ఆదేశాలుండాలని సూచించింది.
అంతకుముందు, నవంబర్ 9న బాణసంచా వినియోగంపై ఎన్జీటీ విచారణ జరిపింది. వాయుకాలుష్యం తీవ్రత ఎక్కువ ఉన్న నగరాలు, పట్టణాల్లో బాణసంచా పూర్తిగా నిషేధించాలని, గాలి నాణ్యత తక్కువ ఉన్న నగరాల్లో టపాసులు నిషేధం కొనసాగాలని స్పష్టంచేసింది. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, నల్గొండ, పటాన్‌చెరు, సంగారెడ్డిలో బాణాసంచాను నిషేధించాలని ఆదేశించింది. గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్‌ను వినియోగించుకోవచ్చునని సూచించింది. దీపావళి రోజున కేవలం 2 గంటలు మాత్రమే పర్యావరణ హితమైన క్రాకర్స్ వాడాలని చెప్పింది. ఆ సమయాన్నితెలంగాణ ప్రభుత్వం నిర్ణయించాలని తీర్పులో పేర్కొంది. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేయగా, తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.