ఆశా వర్కర్లను ఆదుకోండి..!

by Shyam |
ఆశా వర్కర్లను ఆదుకోండి..!
X

దిశ, మెదక్:

ఇంటింటికి తిరుగుతూ అందరికీ వైద్య సేవలపై అవగాహన కల్పిస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మెదక్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేశారు.

కరోనా కాలంలో ఆశా వర్కర్లకు ప్రత్యేక భత్యం చెల్లించాలని.. అలాగే నెలనెలా ఫిక్స్‎డ్ శాలరీ ఇవ్వాలని ఆశావర్కర్లు డిమాండ్ చేశారు. కరోనాను అరికట్టడంలో, జబ్బుపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడం లాంటి ఆశా వర్కర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి అదనపు భత్యం చెల్లించిన ప్రభుత్వం తమకు కూడా రూ. 5వేల అదనపు భత్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృత్తం చేస్తామని ఆశావర్కర్లు హెచ్చరించారు.

Advertisement

Next Story