సూపర్‎స్టార్ స్మాషింగ్ లుక్

by Anukaran |   ( Updated:2022-08-18 03:25:36.0  )
సూపర్‎స్టార్ స్మాషింగ్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ అదిరింది. ఇటీవల సర్కారు వారి పాట పోస్టర్‌లో మాస్ యాంగిల్‌లో అభిమానులను ఉర్రూతలుగించిన సూపర్ స్టార్.. తాజాగా క్లాస్ లుక్ తో కనువిందు చేశాడు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్‌ తన ట్విట్టర్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు 'స్మాషింగ్ న్యూ లుక్' అంటూ ట్వీట్ చేశాడు.

కొవిడ్ బ్రేక్ తర్వాత తిరిగి ఆయనతో కలిసి పనిచేస్తున్నానని.. ఓ ఫోటో అప్‌లోడ్ చేశాడు. ఈ ఫోటోని షేర్ చేసిన మహేశ్ బాబు.. 'మీ పోస్ట్ ప్యాక్ అప్ షాట్లు మిస్ అయ్యాయి !! తిరిగి రావడం మంచిది' అంటూ రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story