టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

by Anukaran |
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఆసక్తికరపోరు మొదలుకానుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం ఎవరు సాధిస్తారో అన్న అంశం అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే పది మ్యాచులు ఆడిన ఇరు జట్లు 6 మ్యాచుల్లో ఓటమి చెంది.. 4 మ్యాచుల్లో విజయాలు సాధించి సమమైన విజయాలు, పరాజయాలను నమోదు చేశాయి. దీంతో 11వ మ్యాచ్‌లో గెలిచేది ఏ టీమ్ అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో మ్యాచ్ చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed