బాలీవుడ్ హీరోయిన్ల వెంటపడుతున్న అన్నదమ్ములు..

by  |   ( Updated:2023-12-14 14:51:57.0  )
బాలీవుడ్ హీరోయిన్ల వెంటపడుతున్న అన్నదమ్ములు..
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో లవ్, డేటింగ్ కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఒక మూవీ కోసం కలిసి పనిచేసిన హీరోహీరోయిన్ల మధ్య రిలేషన్‌షిప్ ఉందని గాసిప్స్ రావడం కామన్. ఈ క్రమంలోనే యంగ్ హీరో సన్నీ కౌశల్‌కు.. తన ‘ది అన్‌ఫర్గెటెన్ ఆర్మీ’ కోస్టార్ శర్వరీ వఘ్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. సన్నీ లేటెస్ట్ ఫిల్మ్ ‘షిద్ధత్’ స్క్రీనింగ్‌కు అటెండ్ అయిన భామ… తనతో చాలా క్లోజ్‌గా మూవ్ కావడమే ఈ రూమర్లు స్ప్రెడ్ అయ్యేలా చేసింది. సన్నీ, శర్వరీ ఈ విషయంపై ఇప్పటికి స్పందించకపోయినా.. ఫ్యాన్స్ మాత్రం పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. ఇద్దరి పెయిర్ బాగుంటుందని.. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటామని చెబుతున్నారు. కాగా శర్వరీ ప్రస్తుతం బంటీ ఔర్ బబ్లీ సీక్వెల్‌లో నటిస్తుండగా.. సన్నీ త్వరలో అప్ కమింగ్ ప్రాజెక్ట్ డిటెయిల్స్ షేర్ చేయనున్నాడు. ఇక సన్నీ బ్రదర్ విక్కీ కౌశల్.. బాలీవుడ్ దివా కత్రినా కైఫ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు, ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయినట్లు వార్తలు వచ్చాయి.

Advertisement

Next Story