రవీందర్ సింగ్‌కు ఆ పదవి టీఆర్ఎస్ పార్టీ పెట్టిన బిక్ష..

by Sridhar Babu |   ( Updated:2021-12-11 06:37:48.0  )
sunil
X

దిశ, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కరీంనగర్‌లోని రెండు స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని, మేయర్ వై. సునీల్ రావు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బల్దియా మేయర్‌గా టీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించిందని, అయిన పదవి కాంక్షతో మళ్లీ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం సిగ్గు చేటన్నారు. టీఆర్ఎస్ పార్టీలో పదవులు పొందిన వారే టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు అని తెలిపాడు.

రవీందర్ సింగ్, తుల ఉమ పదవులు లేకపోవడంతో విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్పోరేటర్ పదవి టీఆర్ఎస్ పెట్టిన బిక్ష అని, మేయర్ పదవిలో ఉండి అనధికారికంగా బల్దియా షెటర్ పొంది అద్దె చెల్లించకుండా, ఇరవై ఏళ్ళ పాటు ఇతరులకు కిరాయికి ఇచ్చుకున్న చరిత్ర అని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రవీందర్ సింగ్ దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. నీతిమాలిన రాజకీయం చేస్తూ, ఎంపీటీసీ, జెడ్పిటీసీ, కౌన్సిలర్, కార్పోరేటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. ప్రలోభాలకు లొంగకుండా, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులమంతా ఒకే తాటి పై నిలిచి, అధిష్టానం నిలబెట్టిన ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు వేసినట్లు స్పష్టం చేశారు.

పోలింగ్ ముగియగానే గెలిచినట్లు సంబరాలు చేసుకున్న అనంతరం కార్పోరేటర్ పదవి ఎందుకని ప్రశ్నించారు. ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే మేయర్ పదవికి రాజీనామ చేస్తానని, ఎమ్మెల్సీగా ఓడిపోతే కార్పోరేటర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటు లేని ఈటెల రాజేందర్ మద్దతు ప్రకటిస్తే, ఓటు ఉన్న సంజయ్ ఓటింగ్ లో పాల్గొనలేదని, మరెలా బీజేపీ మద్దతు ఇచ్చినట్లో చెప్పాలన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న అంతర్గత గ్రూప్ రాజకీయాలతో ప్రజలను కన్ఫూజన్ చేస్తున్నారు. కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసే దాకా వదిలిపెట్టబోమని రవీందర్ సింగ్ ను హెచ్చరించారు.

Advertisement

Next Story