తండ్రికి హెయిర్ కట్ చేసిన ‘యంగ్ హీరో’

by Shyam |
తండ్రికి హెయిర్ కట్ చేసిన ‘యంగ్ హీరో’
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. హిట్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా.. వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ లేక ఇంట్లోనే ఉంటున్న సందీప్.. సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత, సినీ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా తన తండ్రికి, సోదరితో కలిసి హెయిర్ కట్ చేశారు. తండ్రిని చాలా స్టైలిష్‌గా మేకోవర్ చేస్తూ తీసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇప్పటికే విరాట్ కోహ్లీకి తన వైఫ్ అనుష్క శర్మ హెయిర్ కట్ చేయగా, సచిన్ టెండూల్కర్ తానే స్వయంగా హెయిర్ కట్ చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా సందీప్ కూడా తండ్రికి హెయిర్ కట్ చేసి ఆ జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా చేస్తున్న సందీప్.. ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్మించే చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. అందమైన రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని నిర్మాత పి. కిరణ్‌ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed