ఈ రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుస్తారు ఆనందంగా గడుపుతారు

by Hamsa |
ఈ రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుస్తారు ఆనందంగా గడుపుతారు
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : త్రయోదశి (నిన్న ఉదయం 8 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 19 ని॥ వరకు)
నక్షత్రం : ఆశ్లేష (నిన్న సాయంత్రం 5 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 2 ని॥ వరకు)
యోగము : పరిఘము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 6 గం॥ 40 ని॥ నుంచి 8 గం॥ 17 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 24 ని॥ నుంచి 6 గం॥ 1 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 47 ని॥ నుంచి 5 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 53 ని॥ నుంచి 6 గం॥ 26 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 20 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 53 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 14 ని॥ నుంచి 1 గం॥ 47 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 2 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : కర్కాటకము
విశేషం : మాసశివరాత్రి

మేష రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. కొత్త ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తులో లాభాలు. కుటుంబ సభ్యుల మధ్య కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. దానివలన లేనిపోని సమస్యలు. ఇంటి మరమ్మతులకు డబ్బు ఖర్చు పెడతారు. కొంతమంది ఇంటి మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు వలన లాభాలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

వృషభ రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఆఫీసుకు లేటుగా రావడంను పై అధికారులు గమనిస్తున్నారు జాగ్రత్త. తీసుకున్న రుణాలను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారితో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మిథున రాశి : కొన్ని సమస్యలకు చిరునవ్వే సమాధానం. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. విద్యార్థులు మీకు అర్థం కాని సబ్జెక్టు లను అడిగి తెలుసుకోండి. లేకపోతే పరీక్షలలో ఇబ్బంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులకు మంచి తరుణం. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. స్టాక్ మార్కెట్ లలో పెట్టుబడుల వలన లాభాలు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా పెద్ద వారితో పరుషంగా మాట్లాడకండి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కర్కాటక రాశి : మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. సహనము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులను మీ శక్తిసామర్థ్యాలను ఉపయోగించి సకాలంలో పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ లేక ప్రమోషన్. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు లాభకరం. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు.

సింహరాశి : మంచికి చెడుకు ఒకే రకంగా ప్రవర్తించే మీ స్థితప్రజ్ఞతపై అందరి ప్రశంసలు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆదాయ వ్యవహారాలపై కుటుంబ సభ్యులతో చర్చించండి. బంగారు భవిష్యత్తు కై అనవసరపు ఖర్చులను నివారించండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి అధిక శ్రమ పడవలసి వస్తుంది. అధిక శ్రమ వలన వెన్ను నొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు.

కన్య రాశి : పట్టుదల ఆత్మవిశ్వాసం తో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నూతన అవకాశాలు లభిస్తాయి. ఒత్తిడిని అధిగమించడానికి ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు. వ్యాపార విస్తరణ కొరకు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇతరులతో వాదోపవాదాలకు దిగటం వలన సమయం వృధా. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాల వలన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకండి చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒకటి గుర్తు.

తులారాశి : ఆఫీసు పనుల్లో అధిక శ్రమ ఉన్నప్పటికీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ వ్యక్తిత్వం పై అందరి ప్రశంసలు. ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. అనవసరపు దుబారా ఖర్చుల పై పునరాలోచించండి. ఫిట్నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోండి. నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది

వృశ్చిక రాశి : అతిగా ఊహించుకోకండి అందిన దానితో తృప్తి పడండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. మీ కన్నా చిన్న వారికి ఉచిత సలహాలు ఇద్దామనే మీ ప్రయత్నాలు వ్యర్థం. ఇతరుల మీద అసూయ పడటం అంత మంచిది కాదు. కొంతమందికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ అవకాశం. సరైన కమ్యూనికేషన్ వలన సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఆస్తమా పేషెంట్ లు. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

ధనస్సు రాశి : ఆశావహ దృక్పథంతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. సహనంతో ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పై అధికారుల ప్రశంసలు.రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలుమీ పిల్లల చదువులను ఒక కంట గమనించండి వారి భవిష్యత్తుపై సరైన నిర్ణయం తీసుకోండి. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మకర రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక అవసరం. తప్పుడు సలహాలు ఇచ్చే వారిని దూరం పెట్టండి. ముఖ్యమైన నిర్ణయాలను స్వంతంగా ధైర్యంగా తీసుకోండి. ఆఫీసు పనులపై శ్రద్ధ పెట్టండి. సరైన ప్రణాళికతో ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి తరుణం. ఆదాయం పర్వాలేదు అనవసరపు ఖర్చులను నివారించండి. అధిక శ్రమ వలన కాళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు పాత విషయాలను మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

కుంభరాశి : ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు దాని వలన మానసిక ప్రశాంతత వ్యాపారులకు లాభాలు దానివలన ఆర్ధిక సమస్యలు దూరం. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. సరైన భోజనం వలన పూర్తి ఆరోగ్యం. కుటుంబ సమస్యల వలన మానసిక అశాంతి. మీ భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేయండి. ఆఫీసులో మీ పని నిబద్ధత పై అందరి ప్రశంసలు. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు ఆనందంగా గడుపుతారు. ఆదాయం బాగున్నా అనుకోని అదనపు ఖర్చుల వలన డబ్బుకు ఇబ్బంది. అధిక శ్రమ వలన కాళ్ళనొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

మీన రాశి : ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు దాని వలన మానసిక ప్రశాంతత. మీ పిల్లల చదువులను ఒక కంట గమనించండి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు తీర్పు మీకు అనుకూలం. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం పర్వాలేదు అనవసరపు ఖర్చులు వలన డబ్బుకి ఇబ్బంది. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. దాని వలన వారు హర్ట్ అయ్యే అవకాశం. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి పొదుపు చేస్తారు. వ్యాపారులకు లాభాలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

Advertisement

Next Story