రెండు రెట్లు పెరిగిన సన్‌ఫార్మా లాభాలు

by Harish |
రెండు రెట్లు పెరిగిన సన్‌ఫార్మా లాభాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ఔషధ సంస్థ సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 1,852.48 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 913.52 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో ఇతర ఆదాయాలు రూ. 314.95 కోట్లకు చేరుకుంది. అలాగే, కంపెనీ మొత్తం ఆదాయం 9.2 శాతం పెరిగి రూ. 8,781.84 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 8,038.65 కోట్లుగా ఉంది. కాగా, సన్ ఫార్మా కంపెనీ బోర్డు ఒక్కో షేర్‌కు రూ. 5.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

Advertisement

Next Story