Sun Pharma ప్రాఫిట్ వృద్ధి

by Harish |
Sun Pharma ప్రాఫిట్ వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్(Sun Pharmaceutical Industries Ltd) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 70.4 శాతం పెరిగి రూ. 1,812.79 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,064.09 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో సన్‌ఫార్మా కార్యకలాపాల ఆదాయం 5.29 శాతం పెరిగి రూ. 8,553.13 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 8,123.35 కోట్లుగా ఉంది. రూ. 288.28 కోట్లు వాయిదాపడిన పన్ను ఆస్తి ద్వారా సెప్టెంబర్ త్రైమాసికంలో అసాధారణమైన పన్ను లాభం ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలో కొవిడ్-19 సంక్షోభం కంపెనీ పనితీరుపై, సరఫరా గొలుసు, ఉద్యోగులు, లాజిస్టిక్, వినియోగదారులపై ప్రభావాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు 2.78 శాతం పెరిగి రూ. 482.25 వద్ద ట్రేడయింది.

Advertisement

Next Story

Most Viewed