- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిస్ తెలంగాణ హాసిని ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగింది.?
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మోడలింగ్ కోసం ఏపీ నుండి నగరానికి వచ్చిన ఓ యువతి తాను ఆత్మహత్య చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకొని దానిని వీడియో తీసి ఆన్‌లైన్‌లో ఫోస్ట్ చేయడం నగరంలో కలకలం సృష్టించింది. ఆమె స్నేహితులు సకాలంలో గుర్తించి నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు ఆమె నివాసముంటున్న ఫ్లాటు వద్దకు చేరుకొని యువతిని కాపాడారు. విజయవాడ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన హాసిని కొన్ని రోజుల క్రితం మోడలింగ్ చేసేందుకు నగరానికి వచ్చి నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటోంది.
అయితే, గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆమె తాను ఉరి వేసుకుంటున్నట్టు వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. స్నేహితులతో కూడా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పింది. దీంతో ఆమె స్నేహితులు వెంటనే నారాయణగూడ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు సకాలంలో ఆమె ఫ్లాటుకు చేరుకొని రక్షించి బాధితురాలిని హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, హాసిని 2018లో మిస్ తెలంగాణగా ఎంపికైంది. అయితే ఇటీవలే హాసిని ఓ యువకుడు శారీరకంగా వేధిస్తున్నాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.