- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అలా చేస్తే మేం గట్టెక్కుతాం'
దిశ, మెదక్: చెరుకు పంట విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. చెరుకు కొనుగోల్లు పూర్తై సమారు రెండు నెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో నగదు చెల్లించకపోవడంతో చెరుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ వేళ రైతులకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు.
సంగారెడ్డి జిల్లాలోని రెండు కర్మాగారాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వారిపై ఒత్తిడి తెస్తున్నామని అధికారులు చెబుతున్నా రైతులకు మాత్రం డబ్బులు అందటం లేదు. రెండు కర్మాగారాల పరిధిలో కలిపి మొత్తం రూ . 37 కోట్ల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. 2019 – 20 సీజన్ లో టన్ను చెరుకు రూ . 3,080 చొప్పున కొనుగోలు చేశారు. జహీరాబాద్ లో ఉన్న ట్రైడెంట్ కర్మాగారం రైతులకు రూ . 34.31 కోట్లు చెల్లించాలి. ఇప్పటి వరకు రూ .10 కోట్లు మాత్రమే చెల్లించింది. బకాయిలను సాధ్యమైనంతవరకు చెల్లించాలని చాలాసార్లు అధికారులు కర్మాగారం ప్రతినిధులకు సూచించారు. కానీ, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కర్మాగారంలో ఉన్న చక్కెరను అమ్మకుండా సీజ్ చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు తాజాగా నిల్వలను అమ్ముకోవడానికి అనుమతించారు. ప్రస్తుతం ఉన్న నిల్వలను విక్రయిస్తే రూ. 12 కోట్ల వరకు వస్తాయని అంచనా, ఆ మొత్తాన్ని రైతులకు చెల్లించేందుకు సంస్థ ప్రతినిధులు అంగీకరించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసమే ఏప్రిల్ 20 వరకు గడువు ఇచ్చామంటున్నారు.
ట్రైడెంట్ కర్మాగారంలో ఉన్న చక్కెర నిల్వలను అమ్మితే రూ . 12 కోట్ల వరకు వస్తాయని చెబుతున్నా . . . చెల్లించాల్సిన మొత్తం రూ . 24 , 31 కోట్లు ఉంది. దీంతో రూ . 12 కోట్ల నగదును రైతులకు కొంతవరకు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చెరుకు అమ్మీ బిల్లులు రాని వారందరికీ కొంత మొత్తం ఇచ్చేలా చూస్తాం అంటున్నారు. మిగతా నగదు అందుబాటులోకి వచ్చాక పూర్తి స్థాయిలో చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు.
గణపతి కర్మాగారం ( సంగారెడ్డి ) నుంచి రైతులకు రూ . 12 . 9 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని మార్చి 31 లోపు చెల్లిస్తాం అని వారు చెప్పినా లాక్ డౌన్ తో కొంత జాప్యం జరిగిందని అధికారులు వివరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వీరి నుంచి పూర్తి స్థాయిలో రైతులకు డబ్బులు అందేలా అధికారులు, కార్మాగారం ప్రతినిధులతో మాట్లాడుతున్నామని చెరుకు అభివృద్ధి మండలి సహాయ కమిషనర్ రవీందర్ రావు తెలిపారు. చెరుకు రైతులకు పెండింగ్ లో ఉన్న డబ్బులు చెల్లిస్తే తాము ఆర్థిక ఇబ్బందుల నంచి గట్టెక్కుతామని రైతులు వేడుకుటటున్నారు.
Tags: Medak, sugarcane farmers, dues, factories, officers, corona effect