- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
19 నుంచి జీహెచ్ఎంసీలో ఆ పనులన్నీ బంద్
దిశ, సిటీ బ్యూరో : మహా నగర పాలక సంస్థల నెలకొన్న ఆర్థిక సంక్షోభం క్రమంగా మెయింటనెన్స్ పనులపై పడుతోంది. గత ఆర్థిక సంవత్సరం జనవరి 29 తర్వాత మెయింటనెన్స్ పనులకు సంబంధించి బల్దియా బిల్లులు చెల్లించకపోవటంతో బిల్లుల విషయమై జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అఅసోసియేషన్ శనివారం కమిషనర్ లోకేశ్ కుమార్ ను కలిసింది. ఇప్పటి వరకు తమ బిల్లులు సుమారు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు పేరుకుపోయాయని, వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా, ఇపుడు జీహెచ్ఎంసీ వద్ద నిధుల్లేవని, వచ్చిన కొద్దీ విడతల వారీగా చెల్లిస్తామని సమాధానమిచ్చారు. దీంతో సంతృప్తి చెందని కాంట్రాక్టర్లు వెంటనే అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, ఇతర కాంట్రాక్టర్ల అభిప్రాయాలను సేకరించింది. 19వ తేదీ సోమవారం నుంచి పనులన్నీ నిలిపివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హనుమంత్ సాగర్ లు తెలిపారు.
మహానగరంలో జీహెచ్ఎంసీ చేపట్టే వరద నీటి కాలువలు, ఫుట్ పాత్ ల నిర్మాణం, సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో పాటు ఇతర సివిల్ పనులన్నీ తామే చేస్తుంటామని, తామంతా పేద, మధ్య తరగతికి చెందినవారమేనని వివరించారు. బల్దియా పనులు చేపట్టేందుకు తాము కూడా ఇతరుల నుంచి అప్పుగా తీసుకువచ్చి పనులు చేస్తుంటామని, నెలల తరబడి బిల్లులు చెల్లించకపోతే తాము లేబర్‌కు ఎలా కూలీ చెల్లిస్తామని, ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీలు భారం పెరిగిపోతుందని వివరించారు. తమకు రావాల్సిన దాదాపు రూ.500 నుంచి రూ. 600 కోట్ల బిల్లుల బకాయిల్లో కనిష్టంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు బిల్లులున్నాయని వివరించారు. ఇదే బిల్లుల విషయమై గతంలో కమిషనర్ ను కలిసేందుకు ప్రయత్నించినా, ఆయన అందుబాటులో లేకపోవటంతో అదనపు కమిషనర్(ఫైనాన్స్) జయరాజ్ కెనడీని కలిశామని, ఆయన కూడా తమ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవటంతో తాము పనులు ఆపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇప్పటికే ఒక్కో కాంట్రాక్టర్ అప్పుల పాలయ్యారని, గతంలో ఇదే తరహాలో అధికారులు బిల్లుల చెల్లించటంలో తీవ్ర జాప్యం చేయటంతో అప్పుల బాధలు భరించలేక ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్యకు కూడా పాల్పడిన సందర్భమున్నట్లు వారు వెల్లడించారు. గతంలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులు కూడా తామే చేసే వాళ్లమని, ఇపుడు సీఆర్ఎంపీ, హెచ్ఆర్ డీసీఎల్ అంటూ సంస్థలను ఏర్పాటు చేసి వాటి పరిధిలోకి రోడ్ల నిర్మాణం, నిర్వాహణ పనులను తీసుకొచ్చారని, వాటికెందుకు ముందస్తుగానే, పనులు చేయకముందే బిల్లులు ఎందుకు చెల్లిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
బల్దియా ఖజానాలో నిధులు పుష్కలంగా ఉన్నపుడు కూడా తాము సక్రమంగా పనులు చేయించినా, తమకు బిల్లులు చెల్లించేందుకు క్వాలిటీ చెక్ చేసే ఇంజనీర్ మొదలుకుని బిల్లుల తాలుకూ చెక్కునిచ్చే ఉద్యోగులు కూడా తమను లంచాలు డిమాండ్ చేసేవారని, ఇప్పటికీ అధికారులు నిధులు మంజూరు చేసినా, మళ్లీ వారిని బతిమాలుకోవల్సిందేనని, ఇలాంటి వేధింపులు భరించలేకే తాము పనులను నిలిపివేస్తున్నట్లు దామోదర్ రెడ్డి, హనుమంత్ సాగర్ లు వివరించారు. ప్రస్తుతం వర్షం కురిసినపుడు సహాయక చర్యల్లో పని చేసే లేబర్ ను కూడా తామే సమకూరుస్తున్నామని, వారిని కూడా విధులకు పంపబోమని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పేశారు. ఇదే విషయాన్ని తెలిజేస్తూ కమిషనర్ కు శనివారం సాయంత్రం నోటీసు కూడా ఇచ్చినట్లు వారు తెలిపారు.
- Tags
- GHMC
- Latest News