జలదిగ్బంధంలో జనగామ.. పేరుకు మాత్రమే టౌన్ ప్లానింగ్

by Shyam |
జలదిగ్బంధంలో జనగామ.. పేరుకు మాత్రమే టౌన్ ప్లానింగ్
X

దిశ, జనగామ ; పేరుకే జనగామ జిల్లాగా అవతరించింది. జిల్లాలో కలెక్టర్ స్థాయి అధికారులు ముగ్గురు ఉన్నా, రాష్ట్ర ప్రధాన పాలక వర్గంలోని ముఖ్యమైన మంత్రి పదవి ఉన్నా, ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నా జనగామ ఏమాత్రం అభివృద్ధికి నోచుకున్న సందర్భాలు లేవు. ఇందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోనూ. పాలకులు పట్టించుకోక పోవడమేనని స్థానిక ప్రజలు వాపోతున్నారు.జనగామలో చిన్నపాటి వానలు పడిన పట్టణం వ్యాప్తంగా ఉన్న కాలనీలన్ని జలదిగ్భందంలో చిక్కుకుని ప్రజలు తీవ్ర అవస్థ లు పడుతున్న సంఘట నలో జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంటున్నాయి.గత రెండు సంవత్సరాలుగా జిల్లా వాసులు వర్షాలు పడితే ఇంటి నుంచి బయట కురాలేని పరిస్థితులు ఉన్నాయని అధికారులకు చెప్పిన నేటికి పట్టించుకున్న నాదులు లేరని పలువురు వాపోతున్నారు.

జలదిగ్బంధంలో జనగామ..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోని ప్రభావంతో గత 2 రోజులుగా జనగామలో కురిసిన భారీ వర్షానికి జనగామలోని రంగప్ప చెరువు మత్తడి పోస్తుండటంతో జిల్లా కేంద్రంలోని హన్మకొండ- హైదరాబాద్ ప్రధాన రోడ్డు, కుర్మవాడ, బాలాజీనగర్, శ్రీనగర్, జ్యోతినగర్, శ్రీవిల్లాస్ కాలనీ తోపాటుపై నుంచి వస్తున్న వరుద నీటితో జయశంకర్ నగర్, వీవర్స్ కాలనీ, గిర్నిగడ్డ చీటకోడూర్ రోడ్డు పూర్తిగా జలమయంగా మారిపోయాయి.దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు ఇండ్లకే పరిమితమై ఉండాల్సిన పరిస్థితులు
నెలకొన్నాయి.

నాలాల ఆక్రమణపై చర్యలు శూన్యం..

గతంలో నిర్మాణం చేపట్టిన డ్రైనేజీలు ప్రస్తుత జనభాప్రతిపాధికన పోల్చుకుం టే డ్రైనేజీల లోతూ పెంచాల్సిన భాద్యత అధికారులపై ఎంతైన ఉంది.అయినప్పటికీ అధికారు లు డ్రైనేజీల నిర్మాణాలపై శ్రద్ధ వహించకపోనూ..డ్రైనేజీలకు చెందిన నాలాల ఆక్రమణలపై సరైన్యచర్యలు తీసుకోక పోవడమే ప్రధాన కారణమని తెలుస్తుంది.అక్రమ నిర్మాణాల తో జనగామకు వర్షాలు పడిన ప్పుడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.

నామ్కావాస్తుగా టౌన్హనింగ్ విభాగం..

పురపాలిక విభాంగంలో సరైన అవగాహన కలిగిన అధికారు లు లేకపోవడంతో పాటు సరైన సిబ్బంది.లేకపోనూ టౌన్ ప్లానింగ్ అధికారులు వారి పనులను నామ్కిస్తుగా చేపడుతున్నట్లు విమర్శలు సైతం వస్తున్నాయి.గత కలెక్టర్లు శ్రీదేవసేన, వినయ కృష్ణారెడ్డి, గత డీసీపీ మల్లారెడ్డి ప్రత్యేక చొరువతో రోడ్డు ఆక్రమణలపై చర్యలు తీసుకుని నాలాల ఆక్రమణలపై చర్యలు తీసుకున్నారు.ప్రస్తుతం అధికారులు మారినకారణంగా నాలాలపై ఆక్రమణలు మరింత పెరిగాయని, మున్సిపల్ అధికారులు చర్యలు సైతం తగ్గాయని పలువురు వాపోతున్నారు.

పాలకుల నిర్లక్ష్యమే అంటున్న ప్రజలు..

జనగామ జిల్లాగా ఏర్పడిన అభివృద్ధిలో మాత్రం వెనుకంజ లోనే ఉందని, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక చొరువ తీసుకోక పోవడంవల్లే జనగామ ప్రజలు తీవ్రబ్బందులకు గురవుతున్నా రని ప్రతిపక్షాలు, జిల్లా ప్రజలు వాపోతున్నారు.గత రెండు సంవత్సరాలుగా డివైడర్స్ పనులు కొనసాగుతూనే ఉన్నాయని..డివైడర్స్ పనుల పరిస్థితిలానే జిల్లాకేంద్ర అభివృ ద్ధి ఉందని జిల్లా ప్రజలు ప్రభు త్వ పనితీరును వ్యతిరేకిస్తూ, ఇప్పటికైన జనగామను అభివృ ద్ధి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి బుద్ధి చెబుతామ ని పలువురు మహిళలు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story