- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కట్ట తెగిపోయి నీట మునిగిన పంటలు..!
by Shyam |
X
దిశ,ఇబ్రహీంపట్నం: గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో పలు చోట్ల కట్టలు తెగిపోయి పంటపొలాలకు నీరు చేరి తీవ్రనష్టం జరుగుతోంది.
తాజాగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పరిధిలోని ఎల్లమ్మ తాండ గ్రామసమీపంలో ఉన్న మందం కుంటా కట్ట తెగిపోయింది. మంగళవారం రాత్రి కట్ట తెగిపోయి తొమ్మిది ఎకరాల్లో వేసిన పత్తి, జొన్న పంటలకు నష్టం కలిగిందని రైతులు వాపోతున్నారు. కట్ట తెగిపోయే ప్రమాదాన్ని గుర్తించిన రైతులు.. నీటిని దారి మళ్లించే ప్రయత్నం చేయడంతో కొంత మేర నష్టం కలిగిందని.. లేనిచో ఇక్కడ ఉన్న రెండు కోళ్ల ఫామ్స్‌కు కూడా నష్టం జరిగేదని వాపోయారు. గత రెండు రోజులుగా ఎమ్మార్వో, ఎంపీడీవో, ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story