- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ విషవాయవు స్టైరీన్ గ్యాస్ ప్రభావాలు
దిశ, వెబ్‌డెస్క్: 2020 సంవత్సరం ఇంతకంటే దారుణంగా కాదేమో అని అనుకున్న ప్రతిసారీ… మన భావన తప్పు అని నిరూపిస్తోంది. లాక్‌డౌన్ తర్వాత మొదటిసారి తెరిచిన క్రమంలో విషవాయువు విడుదలను ఎల్‌జీ పాలిమర్స్ నియంత్రించలేకపోయింది. దీంతో స్టైరీన్ గ్యాస్ చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించింది. గాఢనిద్రలో ఉన్నవాళ్లందరూ వాయువు పీల్చుకుని ఇబ్బందులు పడ్డారు. అయితే స్టైరీన్ గ్యాస్ మానవ శరీరం మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తుంది? దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
స్టైరీన్ వాయువు అంటే ఏమిటి?
స్టైరీన్ ద్రవాన్ని పాలీస్టైరీన్ ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, రబ్బర్, లేటెక్స్ తయారీకి ఉపయోగిస్తారు. ఇదే మండే స్వభావం గలది. ప్రధానంగా ఇన్సులేషన్ వస్తువులు, పైపుల తయారీలో వాడతారు.
ఆరోగ్యానికి ప్రమాదకరమా?
చాలా ప్రమాదకరం. చర్మం మీద మంటలు, కళ్లలో దురద, ఎర్రగా అవడంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తక్కువ మొత్తంలో పీల్చినపుడు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలు వస్తాయి. అదే ఎక్కువసేపు పీలిస్తే కేంద్రనాడీవ్యవస్థ మీద ్రభావం చూపి తలనొప్పి, అలసట, కళ్లు తిరగడం, చెవుడు, పిచ్చిగా ప్రవర్తించడంతో పాటు వెంటనే మరణం సంభవించవచ్చు.
స్టైరీన్ ఎందుకు ప్రమాదకరం?
స్టైరీన్ వాయువు ముక్కు పొరల మీద తీవ్ర ప్రభావం చూపించడంతో గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. తర్వాత నేరుగా మెదడు, కాలేయాల మీద ప్రభావం చూపించడంతో సమస్యలు త్వరగా కనిపిస్తాయి.
స్టైరీన్ కేన్సర్ కారకమా?
హ్యూమన్ ఆక్యుపేషనల్ స్టడీస్ ప్రకారం స్టైరీన్ వాయువు కేన్సర్ కారకమే. తక్షణమే ప్రభావం చూపించకపోయినా ఈ వాయువును పీల్చడం వల్ల భవిష్యత్తులో లింఫోహెమాటోపోయ్‌టిక్ కేన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తెల్లరక్తకణాల మీద అధిక ప్రభావం కారణంగా ఈ కేన్సర్ వస్తుంది.
Tags: styrene, vizag, LG polymers, cancer, effects, severe effects, central nervous system, white blood cells