- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ హిస్టరీ: మగధ సామ్రాజ్యం (గ్రూప్ -2,3,4 , ఎస్ఐ/కానిస్టేబుల్ స్పెషల్)
ప్రాచీన భారతదేశ చరిత్రలో మగధ ఒక బలమైన సామ్రాజ్యంగా అవతరించింది.
క్రీ.పూ 6వ శతాబ్దం నాటికి షోడశ మహాజనపదాలు (16 రాజ్యాలు) ఏర్పడ్డాయి.
వాటిలో మగధ మాత్రమే రాజ్యానికి కావలసిన ఏడు ముఖ్య లక్షణాలు సంతరించుకుని తొలి రాజ్యంగా అవతరించింది.
భౌగోళికంగా కేంద్రీకరించబడిన విధానం మగధ ఆవిర్భావానికి తోడ్పడింది.
అత్యంత సారవంతమైన గంగా, యమునా పరివాహక ప్రాంతం మగధలో వ్యవసాయోత్పత్తికి అనుకూలంగా ఉండేది.
ఇనుము, రాగి వంటి ఖనిజ సంపద మగధను పారిశ్రామికంగా అభివృద్ధి చేశాయి.
మగధ రాజధానులైన గిరివ్రజ, రాజగృహ, పాటలీపుత్రం..సోనేరి నది తీరాన కొండల మధ్య ఉండటం వలన ప్రకృతి సిద్ధమైన భద్రతను కలిగి ఉంది.
వీరికి గజబలం విస్తృతంగా అందుబాటులో ఉండటం వలన మగధ బలమైన సైనిక శక్తిగా అవతరించింది.
సరిహద్దులకు దూరంగా కేంద్రీకృతం కావడం వలన సరిహద్దు సమస్యలు మగధను ప్రభావితం చేయలేక పోయాయి.
భౌగోళిక సదుపాయాలు మగధకు అనుకూలంగా ఉన్నాయి.
భౌగోళిక పరిస్థితులతోపాటు మగధ పాలన వ్యవస్థ రాచరిక వ్యవస్థ ఆవిర్భావానికి తోడ్పడ్డాయి.
ఇతర రాజ్యాల వలె కాకుండా మగధ ప్రారంభం నుండి వంశపారంపర్య రాచరికం పాటించింది.
మగధను హర్యాంక, శిశునాగ, నంద, మౌర్య వంటి గొప్ప వంశాలు పాలించాయి.
అజాత శత్రువుతో ప్రారంభమైన మగధ రాజ్యం అశోకునితో పతాక స్థాయికి చేరుకుని సహజమైన సరిహద్దులను ఏర్పరచుకోగలిగింది.
రాజనీతి శాస్త్ర కోవిధులైన కౌటిల్యుడు మగధ సామ్రాజ్య వ్యాప్తి సుస్థిరతకు తోడ్పడ్డారు.
ఓటమి ఎరుగని సేనాని అజాత శత్రువు కాలంలో సామ్రాజ్య వ్యాప్తికి పూనుకున్నాడు.
వైద్య శాస్త్రంలో తొలి వైద్యుడిగా ప్రసిద్ధి గాంచిన జీవకుడు బింబిసారుని కొలువుకు చెందినవాడు.
ఈ రాజ్యం ముందు నుండి బ్రాహ్మణ మతానికి దూరంగా ఉంది.
ఇతర జనపదాలలో లేని ప్రజా చైతన్యం మగధ సామ్రాజ్యంలో నెలకొంది.
ఆరో శతాబ్ధం చివరి నాటికి మగధ ఒక బలమైన సామ్రాజ్యంగా అవతరించింది.
ఇస్లాం ఆగమనం
మహ్మద్ ప్రవక్త చే స్థాపించబడిన ఇస్లాం మధ్య ఆసియాలో గణనీయంగా విస్తరించింది.
ఇస్లాంలోకి మార్చబడిన అరబ్బులు ఇస్లాం మత వ్యాప్తిని తమ భాద్యతగా గుర్తించారు.
అరేబియా సముద్రంలో జరుగుతున్న వ్యాపారంపై నియంత్రణకు సింధూ ఆక్రమణ తప్పనిసరి అని అరబ్బులు భావించారు.
సింధూ ఆక్రమణకు ప్రధాన కారణం.. ఇరాన్ పాలకుడు అల్‌హజ్జాజ్‌కు కానుకలు చేరకపోవడం.
సింధూ పాలకుడైన దాహీర్ పరిహారం చెల్లించుటకు నిరాకరించడంతో ఖలీఫా వలీద్ సింధూ పై జిహాద్ (పవిత్ర యుద్ధం) ప్రకటించాడు.
మహ్మద్‌బిన్ ఖాసీం నాయకత్వంలో అరబ్బు సైన్యాలు దాహీర్‌ను హతమార్చి సింధూను ఆక్రమించారు.
దీంతో భారతదేశంలో ఇస్లాం ఆగమనం మొదలైంది.
భారతీయ సంస్కృతిపై ప్రభావం
మధ్యయుగాల చరిత్ర ఇస్లాం ఆగమనంతో ప్రారంభమైంది.
ఇస్లాం ఆగమనంతో సామాజికంగా మార్పులు చోటు చేసుకున్నాయి.
సామాజికంగా హిందూ ముస్లిం సంస్కృతులతో కూడిన ఒక ఉమ్మడి సామాజిక సంస్కృతి ప్రారంభమైంది.
హిందూ ముస్లింలు పరస్పరం తమ ఆచార సాంప్రదాయాలతో ఒకరినొకరు ప్రభావితం చేసుకున్నారు.
ముస్లింల పరదా పద్ధతి సమాజంలో ఉన్నత వర్గాల స్త్రీలు పాటించారు.
ముస్లింల ఆహారపు అలవాట్లు, అదేవిధంగా వస్త్రాలంకరణను హిందువులు ఆదరించారు.
హిందూ సాంప్రదాయమైన దిష్టిని ముస్లింలు నజర్‌గా పాటించారు.
పట్టణ వ్యవస్థ ఇస్లాం రాకతో మరింత అభివృద్ధి చెందింది.
పాలక వర్గాలుగా ముస్లింలు తమ నివాస ప్రాంతాలను పట్టణాలుగా మార్చుకున్నారు.
సాంస్కృతిక రంగంలో మార్పులు:
ముస్లింల వాస్తు శైలిలోని ముఖ్య లక్షణాలైన గుమ్మటాలు, ఖమాన్‌ల నిర్మాణంను హిందువులు స్వీకరించారు.
హిందువుల నుండి ముస్లింలు అలంకరణ పద్దతులను, కట్టడాలపై కలిషములు పెట్టే పద్దతిని, అలంకార ప్రాయమైన స్వస్తిక్, కలువ పువ్వుల గుర్తులను వాడటం ముస్లింలు పాటించారు.
ఫలితంగా ఇంకా ఇస్లామిక్ అను ఒక ఉమ్మడి వాస్తు శైలి అమల్లోకి వచ్చింది. భారతీయ సంగీత సాంప్రదాయం ఇస్లాం ప్రభావానికి గురైంది.
ముస్లింలు తమ వాయిద్యాలుగా షెహనాయ్, సారంగి, రామబ్‌లను ప్రవేశపెట్టారు.
హిందువుల నుండి నాదస్వరం, మృదంగం, ఘటంలను గ్రహించారు.
ఫలితంగా హిందుస్థానీ సంగీతం అను మిశ్రమ సంగీత సాంప్రదాయం ప్రారంభమైంది.
అమీర్ ఖుస్రో ఈ సాంప్రదాయంలో గొప్ప విద్వాంసుడయ్యాడు.
ఇస్లాం ఇతర సాంస్కృతిక రంగాలైన చిత్రలేఖనం, సాహిత్యములను కూడా ప్రభావితం చేసింది.
చిత్రలేఖనాన్ని ఇస్లాం వ్యతిరేకించినప్పటికీ లఘుచిత్రం, తైలవర్ణ చిత్రం ఇస్లాం చే ప్రవేశపెట్టబడ్డాయి.
మొఘల్ చక్రవర్తి హుమయూన్ కాలం నుండి పర్షియన్ చిత్రకళ భారతదేశంలో ప్రవేశించింది.
అక్బర్ తైలవర్ణ చిత్రాలను, కుడ్య చిత్రాలను ప్రోత్సహించాడు.
జహంగీర్ కాలం నాటికి నిలువెత్తు చిత్రపటాలు చిత్రించబడ్డాయి.
సాహిత్య పరంగా ఆత్మకథలు, స్వీయ చరిత్రలు, స్థానిక చరిత్రలు రోజువారీ సంఘటనలను ప్రస్తావించడం వంటి చారిత్రక రచనలు ముస్లింలతోనే ప్రారంభమయ్యాయి.
కచ్చితమైన సమాచారం, కాలకురు పట్టికను పాటించడం, ఉపమానాలు లేకుండా రచనలు చేయడం ముస్లింలతో ప్రారంభమైంది. ఈ సాంప్రదాయానికి ఆధ్యుడు అల్‌బెరూని.
అల్‌బెరూని మహమ్మద్ గజినితో పాటు భారతదేశానికి వచ్చి వారణాసిలో స్వయంగా సంస్కృతాన్ని అభ్యసించాడు.
ఈయన తొలి మధ్యయుగాల భారత చరిత్రపై అత్యంత ప్రామాణికమైన కితాబ్ ఏ హింద్ అను గ్రంథాన్ని రచించాడు.
ఉర్దూ ఒక మిశ్రమ భాషగా అభివృద్ధి చెందింది. సంస్కృతిలో భాగంగానే భారతీయుల ఆచార వ్యవహారాలు, వస్త్ర, వేష అలంకరణలు, ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.
పరదా విధానం, గుర్ఖ, పైజామా, షేర్వాణి వంటి దుస్తులు ధరించుట ప్రారంభమైంది.
మతపరమైన ఉద్యమాలు
తొలి మధ్య యుగాల్లో భారతదేశ సమాజంలోకి ఇస్లాం ప్రవేశించడంతో గొప్ప మార్పులు జరిగాయి.
మతపరంగా ఇస్లాం హిందూమతంలోని అసమానతలను, విగ్రహారాధనను, బహుదేవతారాధనను ప్రశ్నించటం వలన హిందూమతం సంక్షోభాన్ని ఎదుర్కొంది.
ఇస్లాం నుండి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూ.. తనను తాను సంస్కరించుటకు హిందూమతం చేసిన ప్రయత్నాన్ని భక్తి ఉద్యమం అని చెప్పవచ్చు.
వాస్తవానికి భక్తి అనే భావన ప్రాచీన యుగంలో కృష్ణుడు చేత స్థాపించబడింది. భగవతా మతంతో ఇది ప్రారంభమైంది. ఇస్లాం రాకతో భక్తి ఉద్యమ పోకడలు మరింత బలపడ్డాయి.
మధ్యయుగాల్లో భక్తి ఉద్యమం ప్రాచీన భారతదేశంలో ప్రారంభమైన భక్తి ఉద్యమం కంటే భిన్నమైంది. తొలి భక్తి ఉద్యమం కేవలం మోక్షానికి మార్గాన్ని అన్వేషించింది. తత్వ విచారానికి ప్రధాన్యతనిచ్చింది. ఇందుకు భిన్నంగా మధ్యయుగాల నాటి భక్తి ఉద్యమం సామాజిక సమస్యలకు ప్రాధాన్యతనిచ్చింది. సంస్కరణ వాదంతో పాటు రాజకీయ పోకడలను సంతరించుకుంది.