- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారతదేశ ఆక్రమణ: ఇండియన్ హిస్టరీ (గ్రూప్స్ స్పెషల్)
కర్ణాటక ఆక్రమణ (లేదా) ఆంగ్లో-కర్ణాటక యుద్ధాలు:
భారతదేశంలో బ్రిటీష్, ఫ్రెంచి వారి మధ్య జరిగిన యుద్ధాలను ఆంగ్లో-కర్ణాటక యుద్ధాలు అంటారు.
మొత్తం మూడు ఆంగ్లో-కర్ణాటక యుద్దాలు జరిగాయి.
సాదతుల్లాఖాన్ కర్ణాటక్ రాజ్యంను స్థాపించాడు.
ఇతని తర్వాత నవాబు -దోస్త్ అలీ అన్వరుద్దీన్ కాలంలో మొదటి, రెండవ కర్ణాటక యుద్దాలు జరిగాయి.
1) మొదటి ఆంగ్లో-కర్ణాటక యుద్ధం (1746-48):
ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా భారతదేశంలో బ్రిటీష్,ఫ్రెంచి వారి మధ్య మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం మొదలైంది.
భారతదేశంలో బ్రిటీష్ జనరల్ బార్నెట్ ఫ్రెంచి నౌకలపై దాడి చేసి ధ్వంసం చేశాడు.
భారతదేశంలో ఫ్రెంచి జనరల్ డూప్లే మారిషస్‌లో ఉన్న బోర్జినాయిస్/ బోర్డేను భారత్‌కు పిలిపించి, బ్రిటీషు స్థావరం అయిన మద్రాసును ఆక్రమించారు.
కానీ బోర్డినాయిస్ లంచం తీసుకొని మద్రాసును బ్రిటీష్ వారికి అప్పగించి తిరిగి మారిషస్‌కు వెళ్లిపోయాడు.
అపుడు డూప్లే కర్టాటక్ నవాబు అన్వరుద్దీన్ సహాయంతో మద్రాసును తిరిగి ఆక్రమించాడు.
దీనికంటే ముందు డూప్లే అన్వరుద్దీన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది.
దీని ప్రకారం మద్రాసును ఆక్రమించిన తర్వాత అన్వరుద్దీన్ ఆధీనంలో ఉంచాలి.
కానీ డూప్లే మద్రాసును అన్వరుద్దీన్ ఆధీనంలో ఉంచటాన్ని నిరాకరించాడు.
దీంతో అన్వరుద్దీన్ తన డిమాండ్లను పూర్తి చేయ వలసిందిగా హెచ్చరిస్తూ 10 వేల మంది సైనికులను మద్రాసు వైపుకు పంపాడు.
డూప్లే కెప్టెన్ పారడైజ్ నేతృత్వంలో 500 మంది సైనికులను కర్టాటక వైపుకు పంపాడు.
1748లో వీరి మధ్య సెయింట్ థోమ్ లేదా అడయార్(నది) యుద్ధం జరిగింది.
అన్వరుద్దీన్ సైనికులు ఓటమి పాలయ్యారు
1748లో ఆక్సిలా చాపెల్ (ఫ్రాన్స్‌లోని పట్టణం) ఒప్పందం ప్రకారం యూరప్‌లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంతమైంది.
దీంతో భారతదేశంలో కూడా మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అంతమైంది.
ఈ ఒప్పందం ప్రకారం మద్రాసు తిరిగి బ్రిటీష్ వారి సొంతమైంది.