ఇండియన్ పాలిటీ: రాష్ట్రపతి ఎన్నిక - తొలగింపు

by Harish |
ఇండియన్ పాలిటీ: రాష్ట్రపతి ఎన్నిక - తొలగింపు
X

ఆర్టికల్ 52: రాష్ట్రపతి గురించి పేర్కొంటుంది.

రాష్ట్రపతి ప్రథమ పౌరులు

భారత దేశ అధినేతగా పేర్కొంటారు.

భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అమల్లో ఉంటుంది.

పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాల అధిపతులు ఉంటారు.

1. ప్రధాని ప్రభుత్వాధినేత

2. రాష్ట్రపతి రాజ్యాంగాధిపతి

ప్రభుత్వం లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది.

అనగా కార్యనిర్వహణ శాఖ, శాసన శాఖకి బాధ్యత వహించాలి.

వాస్తవ అధికారాలు ప్రధాని అధ్యక్షతన గల మంత్రిమండలికి ఉంటాయి.

నామ మాత్రపు అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి.

అర్హతలు:

రాష్ట్రపతి వయసు - 35 ఏళ్లు

లోక్‌సభ సభ్యుల అర్హతలు కలిగి ఉండాలి.

వయసు మినహా మిగతా అర్హతలన్నీ లోక్ సభ సభ్యుల అర్హతలు వర్తిస్తాయి.

అనర్హతలు:

దివాలా కోరు అయి ఉండరాదు.

మతిస్థిమితం లేని వ్యక్తి అయి ఉండకూడదు. (వీటిని కోర్టు సర్టిఫై చేయాలి)

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండరాదు. ఉంటే రాజీనామా చేయాలి.

ఎన్నిక: ఈ అంశం ఐర్లాండ్ నుండి గ్రహించారు.

రాష్ట్రపతిని ఎలక్ట్రోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది.

ఎన్నికల నియోజక గణంలో సభ్యులు:

ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు- ఎంపీలు (లోక్‌సభ +రాజ్యసభ)

ఎన్నికైన రాష్ట్ర శాసన సభ సభ్యులు (ఎంఎల్‌ఏలు)

ఎన్నికల నియోజక గణంలో సభ్యులు కాని వారు:

1. లోక్‌సభలో రాష్ట్రపతి నామినేట్ చేసిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్

2. రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసిన 12 మంది సభ్యులు

3. వివిధ రాష్ట్రాలకు గవర్నర్లు, అసెంబ్లీకి నామినేట్ చేసిన ఒక ఆంగ్లో ఇండియన్

4. రాష్ట్ర శాసన మండలి సభ్యులు

ప్రమాణ స్వీకారం: రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.

పదవీకాలం: 5 ఏళ్లు.

రాజీనామా:

రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి.

రాజీనామా ప్రతిని లోక్ సభ స్పీకర్ కు పంపుతారు.

రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటించేది - లోక్‌సభ స్పీకర్.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయినప్పుడు రాజీనామాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించాలి.

రెండు పదవులు ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తాడు.

జీత భత్యాలు: రాష్ట్రపతి జీత భత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది.

జీతం పెంచవచ్చు కానీ తగ్గించరాదు.

జీతానికి ఐటీ ఉండదు

కేంద్ర సంఘటిత నిధి నుండి గ్రహిస్తారు.

రాష్ట్రపతికి జీతం: నెలకు 5 లక్షలు లభిస్తుంది.

పదవీ విరమణ తర్వాత పెన్షన్ లభిస్తుంది.

నివాసం:

ఢిల్లీలో రాష్ట్రపతి భవన్,

మరో రెండు నివాసాలు ఉన్నాయి.

1. హైదరాబాద్‌లోని బొల్లారం - శీతాకాల విడిది

2. సిమ్లా - వేసవి కాల విడిది.

రాష్ట్రపతి భవన్ రూపశిల్పి - ఎడ్విన్ లూటియన్స్

తొలగింపు:

రాష్ట్రపతి ని తొలగించే తీర్మానం.. మహాభియోగ తీర్మానం అని అంటారు.

ఆర్టికల్ 61: మహాభియోగ తీర్మానం/తొలగింపు గురించి పేర్కొంటుంది.

కారణాలు: రాజ్యాంగ దిక్కరణ కారణంగా తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టవచ్చు.

మహాభియోగ తీర్మానం ఏ సభలో అయినా ముందుగా ప్రవేశపెట్టవచ్చు.

సభలో 1/4 వ వంతు సభ్యుల ఆమోదం అవసరం.

తీర్మానంను సభా అధ్యక్షుడికి ఇవ్వాలి.

సభా అధ్యక్షుడు అనుమతిస్తే సభలో 14 రోజుల్లోగా చర్చకు వస్తుంది.

దీనిని 2/3వ వంతు మెజారిటీ సభ్యులు ఆమోదించాలి.

2వ సభ కమిటీని ఏర్పాటు చేసి విచారిస్తుంది.

2వ సభ కూడా 2/3 వంతు మెజారిటీతో తొలగింపు తీర్మానం ఆమోదిస్తే రాష్ట్రపతి తొలగించబడతాడు.

2 సభలలో ఏ ఒక్క సభ తిరస్కరించినా తీర్మానం రద్దవుతుంది.

తిరిగి ఎన్నిక:

రాజ్యాంగ రీత్యా ఒక వ్యక్తి ఎన్ని సార్లయినా రాష్ట్రపతి పదవి చేపట్టవచ్చు.

కానీ బాబు రాజేంద్రప్రసాద్ 2 సార్లు మాత్రమే పదవి చేపట్టాలని ఒక సాంప్రదాయం నెలకొల్పాడు.

సాంప్రదాయం దృష్ట్యా రాష్ట్రపతి పదవిని 2 సార్లు చేపట్టాలి.

డా. బి ఎస్ ఎన్ దుర్గాప్రసాద్, డైరెక్టర్ తక్షశిల అకాడమీ.

Advertisement

Next Story

Most Viewed