- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీకర్ వ్యవస్థ: ఇండియన్ పాలిటీ
స్పీకర్:
లోక్‌సభ అధ్యక్షుడిని స్పీకర్ అని పిలుస్తారు.
స్పీకర్ పదవిని బ్రిటన్ నుంచి గ్రహించారు.
ప్రొటెం స్పీకర్ - నూతనంగా ఏర్పడిన లోక్‌సభ సమావేశానికి అధ్యక్షుడిగా ప్రొటెం స్పీకర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.
ప్రొటెం స్పీకర్ విధి: లోక్‌సభకు నూతన స్పీకర్ ఎన్నిక.
ప్రొటెం స్పీకర్‌గా లోక్‌సభలో సీనియర్ అభ్యర్థిని నియమించు సాంప్రదాయం ఫ్రాన్స్ నుండి గ్రహించారు.
లోక్‌సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్ ఎన్నుకుంటారు.
స్పీకర్ పదవి కాలం 5 ఏళ్లు.
సభ రద్దు అయినా స్పీకర్ పదవి రద్దు కాదు.
లోక్‌సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభకు స్పీకర్ సంతకంతో పంపాలి.
రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటించేది స్పీకర్.
నోట్: రాష్ట్రపతి రాజీనామాను ఉపరాష్ట్రపతికి ఇస్తారు.
రాజీనామా: స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కి అందిస్తారు.
డిప్యూటీ స్పీకర్ తన రాజీనామాను స్పీకర్ కి అందిస్తారు.
తొలగింపు: స్పీకర్ తొలగింపు తీర్మానం 14 రోజుల మందుగా లోక్‌సభ సెక్రెటరీకి ఇవ్వాలి.
లోక్‌సభ సభ్యులు 1/2 మెజారిటీతో తొలగించవచ్చు.
స్పీకర్ తొలగింపు:
లోక్‌సభ సభ్యుల్లో 1/10 వంతు (50 మంది) సభ్యుల సంతకాలతో తీర్మానంను లోక్‌సభ సెక్రటరీకి అందించాలి.
లోక్‌సభ సెక్రటరీ 14 రోజుల్లోగా తీర్మానంపై చర్చను ప్రారంభించాలి.
చర్చ అనంతరం ఓటింగ్ ఉంటుంది.
1/2 మెజారిటీతో స్పీకర్‌ను తొలగించవచ్చు.
స్పీకర్‌పై తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభకు అధ్యక్షత వహించరాదు.
సభకు సాధారణ సభ్యుడివలె హాజరు కావచ్చు.
సభ చర్చలో పాల్గొనవచ్చు.
తన అభిప్రాయాలు వెల్లడించవచ్చు.
ఓటు వేయవచ్చు కాని సభ అధ్యక్షుడు వేసే కాస్టింగ్ ఓటు నిర్ణాయక ఓటు వేయరాదు.
కాస్టింగ్ ఓటు (నిర్ణాయక ఓటు): సభలో ఒక బిల్లుపై సమాన ఓట్లు వచ్చినప్పుడు సభలో ఉన్న సంక్షోభాన్ని నివారించేందుకు సభ అధ్యక్షుడు వేసే ఓటు.
డిప్యూటీ స్పీకర్: లోక్ సభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకుంటారు.
విధి: స్పీకర్ లేనప్పుడు తాత్కాలిక స్పీకర్‌గా వ్యవహరిస్తారు.
డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సాంప్రదాయం
రాజీనామా: స్పీకర్ కి ఇస్తాడు.
తొలగింపు: స్పీకర్ తొలగింపు వలె ఉంటుంది.
ప్యానల్ స్పీకర్స్:
మొత్తం ప్యానల్ స్పీకర్ల సంఖ్య - 6
ప్యానల్ స్పీకర్లను లోక్‌సభ స్పీకర్ నియమిస్తాడు.
విధి: సభా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు చూస్తారు.
ఒకవేళ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు.. సభలో నుండి ఒకరిని స్పీకర్ గా రాష్ట్రపతి నియమిస్తాడు.
అయితే ఆ వ్యక్తి సభలో సభ్యత్వం ఉండాలి.
స్పీకర్ విధులు:
సభకు అధ్యక్షత వహిస్తారు.
సభలో సభ్యులు ప్రసంగించేందుకు స్పీకర్ అనుమతి తప్పనిసరి.
సభలో బిల్లు ప్రవేశపెట్టాలంటే స్పీకర్ అనుమతి ఉండాలి.
సభా కార్యక్రమాలకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిని సభ నుంచి బహిష్కరించే అధికారం ఉంటుంది.
సమావేశాలు వాయిదా: పార్లమెంట్ ఏడాదికి కనీసం 2 సార్లు హాజరు కావాలి లేదా ప్రతి 2 సమావేశాల మధ్య కాల వ్యవధి 6 నెలలకు మించరాదు.
సాధారణంగా పార్లమెంట్ ఏడాదికి 3 సార్లు సమావేశమవుతుంది.
1. బడ్జెట్ సమావేశాలు
2. వర్షాకాల సమావేశాలు
3. శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ సమావేశాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.
పార్లమెంట్ సమావేశాలను ముగించేది (ప్రోరోగ్) రాష్ట్రపతి.
సభలో కోరం లేకుంటే సభను వాయిదా వేసేది - స్పీకర్.
కోరం అనగా 1/10 వ వంతు లేదా 55 మంది సభ్యులు అని అర్థం.
ఒక బిల్లు ఆర్థిక బిల్లా ? కాదా..? అని నిర్ణయించేది - స్పీకర్.
పార్టీ ఫిరాయింపు చట్టం: ప్రకారం ఒక సభ్యున్ని సభ నుండి బహిష్కరణ చేసేది లోక్‌సభ స్పీకర్.
లోక్‌సభకి ఇతను కస్టోడియన్ అనగా లోక్‌సభ సభ్యున్ని అరెస్ట్ చేయాలంటే ముందుగా స్పీకర్ అనుమతి అవసరం.
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను నియమించేది - స్పీకర్
లోక్‌సభ సిబ్బందిని నియమించేది - స్పీకర్.
ఒక పార్టీకి సభలో ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చేది స్పీకర్.
పార్టీ ఫిరాయింపు చట్టం:
ఈ చట్టం ప్రకారం ఒక సభ్యుడిని సభ నుండి భహిష్కరణ చేసేది లోక్‌సభ స్పీకర్.
లోక్ సభకు స్పీకర్ కస్టోడియన్.. అనగా లోక్‌సభ సభ్యున్ని అరెస్ట్ చేయాలంటే ముందుగా స్పీకర్ అనుమతి అవసరం.
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను నియమించేది - స్పీకర్.
ఒక పార్టీకి సభలో ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చేది స్పీకర్.
నోట్: ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా పొందాలంటే మొత్తం సీట్లలో 1/10 వ వంతు సీట్లు రావాలి.
లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే 55 సీట్లు రావాలి.
రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్:
రాష్ట్రపతి అధికార రీత్యా రాజ్యసభకి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.
డిప్యూటీ ఛైర్మన్: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ను పోలి ఉంటుంది.
ప్యానల్ డిప్యూటీ చైర్మన్స్ వీరు 6 గురు ఉంటారు.
రాజ్యసభ ఛైర్మన్ వీరిని నియమిస్తారు.
రాజ్యసభ ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేయలేడు.
రాష్ట్రపతి పదవిలో ఉన్నంత కాలం రాజ్యసభకు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.