సోషల్ మీడియాలో ‘ఇండియన్ మామ్స్’

by Shyam |
సోషల్ మీడియాలో ‘ఇండియన్ మామ్స్’
X

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వల్ల ప్రపంచంలో చాలామందికి సెలవులొచ్చాయి. కానీ ‘అమ్మ’లకు మాత్రం ఆ జాబితాలో చోటు దక్కలేదు. హాలీడేస్ మాట దేవుడెరుగు.. పని భారం మరింత పెరిగింది. లాక్‌డౌన్ కారణంగా ఓ వైపు పిల్లలకు స్కూళ్లు, కాలేజీలు లేవు, మరోవైపు ఉద్యోగస్తులందరూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. దాంతో వాళ్లు.. తల్లి, భార్య, చెఫ్, టీచర్, క్లీనర్, గైడ్ ఇలా మల్టిపుల్ పనులు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒక వేళ ఉద్యోగం చేసే ప్రొఫెషనల్స్ అయితే ఆ పని కూడా చేయాల్సిందే. ఇంత బిజీ షెడ్యూల్‌లో వారికి ఖాళీ ఎక్కడ దొరుకుతుంది. అయితే ఓ అధ్యయనం మాత్రం ‘అమ్మ’లకు కూడా టైమ్ పాస్ చేయడానికి టైమ్ ఉందని చెబుతోంది.

ఎప్పుడు చూసినా.. బిజీబిజీగా గడిపే అమ్మలు రోజులో 2 నుంచి 3 గంటలపాటు ఇంటర్నెట్‌లో గడుపుతారని ‘ద డిజిటల్ యూసేజ్ ఆఫ్ ది ఇండియన్ మామ్స్’ అనే సర్వేలో తేలింది. తమ రోజువారీ పనులకు ఏ మాత్రం ఆటంకం కలగకుండా, ఇంటర్నెట్‌కు కూడా టైమ్ ఇస్తున్నారని ఆ సర్వే స్పష్టం చేసింది. 12 ఏళ్ల లోపు పిల్లలున్న కొంతమంది తల్లులపై చేసిన ఈ సర్వేలో 36 శాతం మంది మహిళలు లాక్‌డౌన్‌లో కొత్తగా ‘ఇన్‌స్టాగ్రామ్’‌ను యూజ్ చేయడానికి మక్కువ చూపారు. ‘పేరెంటింగ్ టిప్స్’ తెలుసుకోవడానికి గూగుల్‌ను 23 శాతం మంది ఉపయోగించుకున్నారు. మరో 30 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు ఎక్కువ టైమ్ కేటాయించారు. మొత్తంగా వాట్సాప్, ఇన్‌స్టా‌‌ల్లో మహిళలు ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. తమ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి 55 శాతం మంది అమ్మలు.. ఇష్టపడటం లేదు. అయితే, వారిని మీ ఫేవరేట్ పేరెంటింగ్ ప్లాట్‌ఫాం ఏది? అని ప్రశ్నించగా.. 32 శాతం మంది ‘యాప్’, 22 శాతం మంది ‘సోషల్ మీడియా’, 18 శాతం మంది ‘వెబ్‌సైట్’ అని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed