కేసీఆర్‌కు ఊహించని కండీషన్‌.. జనగామలో విద్యార్థి సంఘాల గర్జన

by Ramesh Goud |
కేసీఆర్‌కు ఊహించని కండీషన్‌.. జనగామలో విద్యార్థి సంఘాల గర్జన
X

దిశ, జనగామ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని జనగామలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 20వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో కేసీఆర్ పర్యటన ఉన్నందున ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని.. గురువారం జనగామ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, రాస్తారోఖో నిర్వహించారు. 20వ తేదీ కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో “మెడికల్ కాలేజీని ప్రకటించాలని జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుంగ కౌశిక్, వెంపటి అజయ్, బింగి నర్సింహులు, రాకేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story