- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వినికిడి లోపం.. కానీ ఎదుటివారి మాటలు డిస్‌ప్లేలో చదవాలనుకుంటే..
దిశ, ఫీచర్స్ : గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి లైవ్ సంభాషణలు, సమాచారాన్ని ప్రాసెస్ చేసే గూగుల్ గ్లాస్ నుంచి ప్రేరణ పొందిన యువకుడు ‘ట్రాన్స్‌క్రైబ్ గ్లాస్’ను రూపొందించాడు. వినికిడి లోపంతో బాధపడుతున్న తన స్నేహితుడు 2017లో 11వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ మానేయడంతో అందుకు గల కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల మాధవ్ లవకరే .. వినికిడి కారణంగా తోటివారు, ఉపాధ్యాయులతో కమ్యూనికేట్ కాలేకపోతున్నారని గ్రహించాడు. దీంతో అటువంటి వారికి సాయం చేసేందుకు నిర్ణయించుకున్న మాధవ్.. వినూత్నమైన ట్రాన్స్‌క్రైబ్ గ్లాస్‌ను నిర్మించాడు. ఇది వినికిడి లోపం ఉన్నవారికే కాకుండా సాంకేతిక సహాయం అవసరమైన వృద్ధులకు కూడా ఉపయోగపడుతుంది.
2019లో ‘టింకర్‌టెక్’ ల్యాబ్స్ పేరుతో స్టార్టప్ స్థాపించి.. నాలుగు నమూనాలపై ఐదేళ్లు పనిచేసిన మాధవ్ ఈ పరికరాన్ని రూపొందించాడు. యూజర్ మొదట మొబైల్ యాప్‌ను లాంచ్ చేసి, స్పీచ్-టు-టెక్స్ట్ క్యాప్షన్ ఎంచుకుంటాడు. ఇందులోని సాంకేతికత ఆటోమేటిక్‌గా మనం మాట్లాడే మాటలను పదాల రూపంలోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ టెక్స్ట్ బ్లూటూత్ ద్వారా హార్డ్‌వేర్ పరికరంలోని డిస్‌ప్లేలో ప్రసారమవుతుంది. ఈ పరికరం వినియోగదారు ధరించే కళ్లజోడు ఫ్రేమ్‌లలోని అద్దాలలో ఒకదానికి జోడించి ఉంటుంది. కాగా ఈ కళ్లజోడు.. ఆ సమయంలో మాట్లాడుతున్న వ్యక్తిని చూడటానికి, అదేవిధంగా తన మాటలను సౌకర్యవంతంగా చదవడానికి అనుమతిస్తుంది. దీని బరువు దాదాపు 20 గ్రాములు ఉండగా ధర రూ. 4,000 కంటే తక్కువ. ఇక కంటిపై ఒత్తిడి తగ్గించేందుకు ఆప్టికల్ అడ్జస్ట్‌మెంట్స్ కలిగి ఉన్న ఈ పరికరం.. ప్రస్తుతం ఆంగ్లంలో మాత్రమే క్యాప్షన్స్ ప్రదర్శిస్తుండగా, ప్రాంతీయ భాషల్లోనూ ఈ రకమైన ఫెసిలిటీ అందించే ప్రయత్నం చేస్తున్నాడు మాధవ్. ఈ ఆవిష్కరణకు గానూ NCPEDP-Mphasis యూనివర్సల్ డిజైన్ అవార్డ్స్ 2021ని గెలుచుకున్నాడు.
‘వినికిడి లోపమున్న నా స్నేహితుడికే కాదు ఈ సమస్యతో బాధపడుతున్న మరెంతోమందికి ఉపయోగపడే విధంగా డివైజ్ రూపొందించాలనుకున్నా. ముందుగా భాషా గ్రహణశక్తిని మెరుగుపరిస్తే ఆ సమస్యకు ఓ పరిష్కారం దొరకుతుందని అనుకున్నాను. వినికిడి యంత్రాలు లేదా కోక్లియర్ ఇంప్లాంట్లు ఉపయోగించవచ్చు కానీ అవి రెండు కూడా ఖరీదైనవి. ముఖ్యంగా కోక్లియర్ ఇంప్లాంట్లకు లక్షల్లో ఖర్చవుతుంది. ఇక స్పీచ్-టు-టెక్స్ట్ యాప్‌లు ఉన్నా అందులో క్యాప్షన్ క్వాలిటీ సరైన స్థాయిలో లేదు. క్యాప్షన్‌లను చదవాలనుకున్న ప్రతిసారీ ఫోన్‌ని చూడాలి, దీనివల్ల క్లాస్‌లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం అసౌకర్యంగా ఉంటుంది. అదే సమాచారాన్ని టెక్స్ట్ క్యాప్షన్‌లలోకి అనువదించి, వాటిని హెడ్స్-అప్ డిస్‌ప్లేలో అందించడం వల్ల మేలు కలుగుతుందని భావించాను. గూగుల్ గ్లాస్ ప్రేరణతోనే ఈ ఆలోచన వచ్చింది. గూగుల్ సహా యూట్యూబ్ వీడియోలు, ప్రోగ్రామింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, డిజైన్, ఆప్టిక్స్, ఎలక్ట్రానిక్స్ వంటి విషయాలను సెర్చ్ చేసి ఈ పరికరాన్ని నిర్మించాను. ఈ విషయంలో కొంతమంది సాంకేతిక సలహాదారులు, నిపుణులు సాయం అందించారు. వినికిడి లోపం ఉన్న వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి విలువైన సూచనలు అందించారు’ అని మాధవ్ తెలిపాడు.