- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బజాజ్ టూ-వీలర్‌కు డిమాండ్..వెనకబడ్డ త్రీ-వీలర్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కంపెనీ బజాజ్ ఆటోకు దేశీయంగానూ, అంతర్జాతీయ మార్కెట్లోనూ ద్విచక్ర వాహనాల డిమాండ్ పెరిగిందని, అయితే, త్రీ-వీలర్ విభాగంలో ఇంకా పునరుజ్జీవనం పొందాల్సి ఉందని బజాజ్ ఆటో సీఎఫ్‌వో సోమెన్ రే తెలిపారు. బజాజ్ ఆటో నెలవారీగా అమ్మకాల్లో మెరుగ్గా ఉంది.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్‌లో అమ్మకాలు అస్సలు జరగలేదు. మేలో అత్యధిక క్షీణత నమోదు చేశాం. మే కంటే జూన్ కొంత మెరుగైనా, జూన్ కంటే జులైలో మరింత మెరుగైన అమ్మకాల ఫలితాలను సాధించామని’ సోమెన్ రే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, అమ్మకాల డిమాండ్‌పై పూర్తి స్పష్టత ఆగష్టు నాటికి తెలుస్తుందని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కంపెనీ దేశీయ మార్కెట్లో 1,85,981 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంలో 6,10,936 యూనిట్లతో పోలిస్తే ఇది 69.55 శాతం తగ్గింది.
అయితే, అనుకోని పరిస్థితుల కారణంగా త్రీ-వీలర్ విభాగం ఇంకా కోలుకునేందుకు సమయం పడుతుంది. ఈ విభాగంలోని వాహనాలు ఎక్కువగా రుణాసాయం ద్వారా విక్రయించబడతాయి. కాబట్టి వ్యాపారం లేని పరిస్థితుల్లో వీటి అమ్మకాలు తక్కువగానే ఉంటాయని సోమెన్ రే అభిప్రాయపడ్డారు. దేశంలో ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్న లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తేసిన తర్వాత త్రీ-వీలర్ అమ్మకాలు పుంజుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బజాజ్ ఆటో తొలి త్రైమాసికంలో దేశీయ మార్కెట్లో కంపెనీ వాణిజ్య వాహన అమ్మకాలు(త్రీ-వీలర్) 93.87 శాతం క్షీణించి 5,282 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 86,217 యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ పేర్కొంది. రాబోయే పండుగ సీజన్‌లో ఈ విభాగం మరింత మెరుగ్గా ఉంటుందని సోమెన్ రే తెలిపారు. బజాజ్ ఆటో తొలి త్రైమాసికంలో అంతర్జాతీయ మార్కెట్లలో 2,13,000 యూనిట్లను విక్రయించగా, గతేడాది ఇదే కాలంలో 4,71,691 యూనిట్లను విక్రయించింది. బజాజ్ ఆటోలో 48 శాతం వాటా ఉన్న జర్మనీ, ఆస్ట్రేలియా, యూఎస్ వంటి దేశాలలో చాలా బలమైన పునఃప్రారంభాన్ని సాధిస్తోందని సోమెన్ రే చెప్పారు.