సింగరేణిలో మళ్లీ మోగిన సమ్మె సైరన్

by Sridhar Babu |   ( Updated:2021-11-25 10:33:30.0  )
సింగరేణిలో మళ్లీ మోగిన సమ్మె సైరన్
X

దిశ, గోదావరిఖని: సింగ‌రేణిలో స‌మ్మె సైర‌న్ మోగింది. నాలుగు బొగ్గు గ‌నుల ప్రైవేటీక‌ర‌ణ‌ను వేలం వేయాల‌ని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం స‌మ్మె నోటీసు ఇచ్చింది. డిసెంబ‌ర్ 9వ తేదీ నుంచి నిర‌వ‌ధిక స‌మ్మె చేస్తామ‌ని టీబీజీకేఎస్ ప్రక‌టించింది. కేంద్రం దిగొచ్చే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని సింగ‌రేణి కార్మికులు స్పష్టం చేశారు.

‘క‌ల్యాణ్ ఖ‌ని బ్లాక్ -6, కోయ‌గూడెం బ్లాక్ -3, స‌త్తుప‌ల్లి బ్లాక్ -3, శ్రావ‌ణ‌ప‌ల్లి బొగ్గు గ‌నుల‌ను వేలం వేయాల‌ని కేంద్రం నిర్ణయించింది. సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయడం వల్ల సింగరేణి ప్రశ్నార్థకంగా మారుతుందని, కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేయడం వల్ల చాలీచాలని జీతాలతో కార్మికులకు అన్యాయం జరుగుతుంద’ అంటూ టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ మిర్యాల రాజి రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed