ఇద్దరు జర్నలిస్టులపై వీధి రౌడీల వీరంగం

by Anukaran |   ( Updated:2020-07-15 12:03:12.0  )
ఇద్దరు జర్నలిస్టులపై వీధి రౌడీల వీరంగం
X

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో వీధి రౌడీలు వీరంగం సృష్టించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 నందినగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ ఓ దిన పత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తుండగా అతని సోదరుడు దిలీప్ కూడా అదే పత్రికలో సబ్‌ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నందినగర్ గ్రౌండ్స్ ఖాళీ స్థలంలో బుధవారం సాయంత్రం కొందరు వీధి రౌడీలు మద్యం తాగుతూ రోడ్డుపై వచ్చిపోయేవారిని దుర్భాషలాడుతున్నారు. అదే సమయంలో ఇంటి నుంచి ఆఫీస్ వైపు వెళ్తున్న అరుణ్, దిలీప్‌తో రౌడీలు గొడవకు దిగి, మద్యం బాటిళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో దిలీప్ తలకు, అరుణ్ ఛాతీకి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు అక్కడికి చేరుకోగానే దుండగులు పరారయ్యారు. బాధితులు దిలీప్, అరుణ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వ్యక్తులను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story