ATMల వద్ద వింత దొంగలు..!

by Anukaran |   ( Updated:2020-09-26 10:39:52.0  )
ATMల వద్ద వింత దొంగలు..!
X

దిశ,సిద్దిపేట: ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేస్తానని చెప్పి పిన్ నెంబర్లు తెలుసుకుని దొంగతనాలకు పాల్పడే నిందితులను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రాజమండ్రికి చెందిన రాజ్ కుమార్ గా గుర్తించారు.

వన్ టౌన్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావు పేట మండల కేంద్రానికి చెందిన పర్వతం రమేష్ జూన్ 23న పాత బస్టాండ్ ప్రక్కన ఉన్న ఏటీఎంలోకి వెళ్లి, అక్కడే ఉన్న రాజ్ కుమార్‎కు కార్డుతో పాటు పిన్ నెంబర్ చెప్పి పదివేల రూపాయలు డ్రా చేసి ఇవ్వమన్నాడు. రమేష్ కు డబ్బులు డ్రా చేసి ఇచ్చి వేరొక ఏటీఎం కార్డును ఇచ్చి పంపించాడు. అనంతరం రాజ్ కుమార్ రమేష్ కార్డుతో రూ.65,000 డ్రా చేసుకుని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రమేష్ అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు విచారణలో భాగంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. పోలీసులను చూసి పాత బస్టాండ్ వద్ద ఏటీఎం సెంటర్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా పారిపోవడాన్ని గమనించారు. దీంతో అతడిని వెంబడించి పట్టుకుని విచారించగా దొంగతనానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.80,000 నగదు, 18 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ సైదులు వెల్లడించారు. నిందితుడు తెలంగాణలోనే కాకుండా ఏపీ,మహారాష్ట్ర, ఛత్తీస్‎ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed