నాగర్ కర్నూలులో వింత మేకపిల్ల జననం

by Shyam |
నాగర్ కర్నూలులో వింత మేకపిల్ల జననం
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు చోటు చేసుకుంటున్నాయి. ఆవుకు మనిషి జన్మించడం, ఒక మనిషికి రెండు తలలు ఇలా ఎన్నో వింతలు విడ్డూరాలు మనం చూస్తూనే ఉంటాం. కొంత మంది వీటిని చూసి కలియుగం బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అంటారు. అయితే అలానే నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని అచ్చంపేట మండల పరిధిలోని అంకిరోనిపల్లి గ్రామంలో రైతు అశోక్ చెందిన మేక శనివారం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన వింత మేకపిల్లను చూసి రైతు ఆశ్చర్యపోయాడు. ఆ మేక పిల్లలకు నాలుగు చెవులు, 8 కాళ్లు, మూడు శరీర భాగాలు ఉన్నాయి. వింత మేకపిల్ల జన్మించిందని గ్రామంలో తెలియడంతో గ్రామస్తులందరూ గుంపులుగా వచ్చి వీక్షించారు. జన్మించిన వింత మేకపిల్ల కొద్దిసేపటికి మరణించిందని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Next Story