అంతుచిక్కని వింత వ్యాధి.. పెరుగుతున్న బాధితులు

by Shamantha N |   ( Updated:2021-06-07 03:22:33.0  )
అంతుచిక్కని వింత వ్యాధి.. పెరుగుతున్న బాధితులు
X

దిశ, వెబ్‌డెస్క్ : కెనడాను ఓ వింత వ్యాధి కలవరపెడుతుంది. ఇప్పటికే ప్రపంచమంతా కరోనాతో సతమతమైపోతుంటే కెనడాలో మరో వింత వ్యాధి ఆందోళన కలిగిస్తుంది. నిద్రలేమి, కండరాల బలహీనత, పీడకలలు వంటి లక్షణాలతో అక్కడి ప్రజలు బాధపడుతూ ఆసుపత్రులలో చేరుతున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా కెనడాలోని న్యూబ్రన్స్‌విక్‌ ప్రావిన్స్‌లో ఈ వింత వ్యాధి బాధతులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికీ 48 మంది ఈ వింత వ్యాధిబారినపడి ఆసుపత్రిలో చేరారు. అయితే ఈ వ్యాధికి గల కారణాలు మాత్రం తెలియడంలేదు. కొంతమంది సెల్ ఫోన్ అతిగా వాడటం వలన అంటే మరికొంత మంది వ్యాక్సిన్ తీసుకోవడం వలన అని భావిస్తున్నారు. అదేం కాదు వాతావరణంలో వస్తున్న మార్పులే ఈ వింత వ్యాధికి కారణమని ఇంకొందరు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed